Andhra pradesh : ప్ర‌భుత్వ నిర్ణ‌యం వెన‌క్కు తీసుకోవాలి.. విశాఖ శార‌దాపీఠం

వైఎస్ జ‌గ‌న్ - స్వరూపానందేంద్ర సరస్వతి (ఫైల్ ఫోటో)

బ్రాహ్మణ కార్పొరేషన్‌ను (Bramhin Corporation) వెనుకబడిన సంక్షేమ శాఖలో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని స్వరూపానందేంద్ర సరస్వతి భావిస్తున్నట్లు శారదాపీఠం ఓ ప్రకటనలో పేర్కొంది. అగ్ర వర్ణాలన్నింటినీ ఈబీసీ (EBC) జాబితాలోకి చేర్చాలని శారదాపీఠం ప్రతిపాదిస్తోంది.

  • Share this:
    బ్రాహ్మణ కార్పొరేషన్‌ను (Bramhin Corporation) వెనుకబడిన సంక్షేమ శాఖలో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని స్వరూపానందేంద్ర సరస్వతి భావిస్తున్నట్లు శారదాపీఠం ఓ ప్రకటనలో పేర్కొంది. అగ్ర వర్ణాలన్నింటినీ ఈబీసీ (EBC) జాబితాలోకి చేర్చాలని శారదాపీఠం ప్రతిపాదిస్తోంది. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నామని, బ్రాహ్మణులను బీసీ జాబితాలోకి కలపాలని చూస్తే పోరాటం చేస్తామని విశాఖ శారదాపీఠం స్ప‌ష్టం చేసింది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు శారదాపీఠం తెలిపింది. అగ్ర వర్ణాలన్నింటినీ ఈబీసీ జాబితాలోకి చేర్చాలని శారదాపీఠం ప్రతిపాదిస్తోంది. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నామని, బ్రాహ్మణులను బీసీ జాబితాలోకి కలపాలని చూస్తే పోరాటం చేస్తామని విశాఖ శారదాపీఠం హెచ్చరిస్తోంది.

    ఇటీవ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్​​ను దేవాదాయశాఖ నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెరుగైన సమన్వయం కోసం బ్రాహ్మణ కార్పొరేషన్​ను బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్​ను ఆర్థికంగా వెనుకబడిన కార్పోరేషన్ల పరిధిలోకి తీసుకురావటం వల్ల సంస్థల మధ్య మరింతగా మెరుగైన సమన్వయం సాధించేందుకు అవకాశముంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మార్పు కోసం ఏపీ ప్రభుత్వ నిబంధనల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    Andhra pradesh : ఏవిధంగా ఇబ్బంది పెట్టామో పవన్ క‌ల్యాణ్ చెప్పాలి : మంత్రి పేర్నినాని


    దీని కోసం తగిన చర్యలు చేపట్టాల్సిందిగా దేవాదాయశాఖను, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణ‌యంపై సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకూ బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖ కిందకు తీసుకు రావాలన్న డిమాండ్ ఎవరు చేశారంటూ విమ‌ర్శ‌లు చేశారు. దీనిపైనే విశాఖ‌శార‌దాపీఠం స్పందించింది.

    వైఎస్ జ‌గ‌న్‌కు విశాఖ శార‌దాపీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తికి మంచి సంబంధాలు ఉన్న విష‌యం అంద‌రికీ తెలుసు. ఆయ‌న సీఎం జ‌గ‌న్మోహ‌రెడ్డిపై ప్ర‌త్యేక అభిమానం చూప‌డాన్ని చాలా మంది త‌ప్పు కూడా ప‌ట్టారు. రాజ‌కీయ నాయ‌కుల‌పై ఇలాంటి ప్ర‌త్యేక అభిమానం ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నించేవారు కానీ.. అవ‌న్ని స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకొన్న చాలా నిర్ణ‌యాలు వివాదాస్ప‌దం అయినా పెద్ద‌గా వారు స్పందింలేదు. అయితే తాజాగా ప్ర‌భుత్వ నిర్ణ‌యం విశాఖ శార‌దాపీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తికి న‌చ్చ‌లేదు. దీనిపై బ‌హిరంగ‌గా అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
    Published by:Sharath Chandra
    First published: