విశాఖ సాల్వెంట్ ఫ్యాక్టరీ పేలుడు: మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు

ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 20 లక్షల పరిహారం ఇస్తామని వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లేష్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

news18-telugu
Updated: July 15, 2020, 8:04 AM IST
విశాఖ సాల్వెంట్ ఫ్యాక్టరీ పేలుడు: మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
విశాఖ పరవాడ ఫార్మా సిటీ సాల్వెంట్‌ ఫాక్టరీ జరిగిన ప్రమాదంలో మృతిచెందిన శ్రీనివాస్‌రావు కుటుంబానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిహారం ప్రకటించారు. కంపెనీ యజమాన్యం తరఫున రూ. 35 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 15 లక్షల పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. మొత్తంగా రూ.50 లక్షలు శ్రీనివాస రావు కుటుంబానికి అందజేయనున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 20 లక్షల పరిహారం ఇస్తామని వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లేష్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ఇక ఈ ప్రమాదంపై కలెక్టర్‌ వినయ్ చంద్‌కు విచారణ కమిటీ నివేదిక అందజేసింది. ఐదుగురు సభ్యులున్న ఈ కమిటీ.. ప్రమాదం జరిగిన తీరు, ఆ తర్వాత నెలకొన్న పరిణామాలపై రెండు పేజీల నివేదికను సమర్పించింది. సాల్వెంట్‌ రికవరీ రియాక్టర్‌ వద్ద డై మిథైల్ సల్ఫాక్సైడ్ శుద్దిచేసే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా కమిటీ తమ నివేదికలో పేర్కొంది. సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిచేయడంలో సిబ్బంది విఫలం కావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు.

విశాఖ రాంకీ ఫార్మాసిటీలో ఉన్న సాల్వెంట్స్‌ కంపెనీలో సోమవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో సీనియర్‌ కెమిస్ట్‌ శ్రీనివాసరావు ‌(40) చనిపోయారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేష్ (33) గాజువాకలోని ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు. మరో ముగ్గురికి స్పల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలం దగ్గర 15 మంది వరకు ఉన్నట్టు ఉన్నారని.. 15 నుంచి 20 రసాయన డ్రమ్ములు పేలాయని స్థానికులు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్, సాయినార్ ఫార్మా, విశాఖ సాల్వెంట్స్.. ఇలా విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
Published by: Shiva Kumar Addula
First published: July 15, 2020, 7:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading