ఎన్నికలకు 2 నెలల ముందు విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటించిన కేంద్రం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. విభజన హామీలను అమలుపర్చలేదని ఆగ్రహంతో ఉన్న ఏపీ ప్రజలను విశాఖ జోన్‌తో కొంతమేర శాంతింపజేసే ప్రయత్నం చేసింది. ఎన్నికల్లోనూ ఈ అంశం తమకు లాభం చేకూర్చుతుందని అంచనావేసింది. ఐతే వాల్తేరు డివిజన్‌ను చేర్చకపోవడంతో సీన్ రివర్స్ అయింది. మోదీ ప్రభుత్వంపై టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్ మసిపూసిన మారేడుకాయ అన్నారు చంద్రబాబు. శాఖ రైల్వే జోన్ ఇచ్చి వాల్తేర్ డివిజన్ మింగేశారని మండిపడ్డారు. ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర పన్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
విశాఖ రైల్వే జోన్ ఇచ్చారు, వాల్తేర్ డివిజన్ మింగేశారు. ఏపికి రూ.6,500 కోట్లు నష్టం చేసారు. హుద్-హుద్ పరిహారం రూ.1000 కోట్లలో సగం ఎగ్గొట్టారు. తిత్లీ బాధితులకు అన్యాయం చేసారు. 7 జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి లాగేసారు. ఇది నమ్మించి మోసగించడం కాదా? నమ్మక ద్రోహం కాదా?
— చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం
బీజేపీ చేసిన మోసాన్ని వైసీపీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. అటు అమరావతిని తరలించాలని వైసీపీ గతంలో కుట్రలు చేసిందని, కానీ అభివృద్ధిని చూసి ఏమీ చేయలేక రాజధానిని తరలించబోమని ఇప్పుడు ప్రకటనలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఇరుపార్టీల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ నేతలకు టెలీకాన్ఫరెన్స్‌లో సూచించారు. విభజన హామీలను అమలుచేయాలన్న డిమాండ్‌తో శుక్రవారం టీడీపీ నేతలంతా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.