మందుబాబుల వీక్ నెస్‌తో ఓ వ్యక్తి వినూత్న ఐడియా... కూర్చుని సంపాదన...

మద్యం షాపుల దగ్గర కొనుగోలు దారులు సామాజిక దూరం పాటించడానికి గొడుగులు వాడాలంటూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: May 23, 2020, 3:07 PM IST
మందుబాబుల వీక్ నెస్‌తో ఓ వ్యక్తి వినూత్న ఐడియా... కూర్చుని సంపాదన...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మందుబాబుల వీక్ నెస్ అతడికి ఆదాయ మార్గంగా మారింది. చిన్న ఐడియాతో అతడు తన పొట్టపోసుకుంటున్నారు. భారీగా సంపాదించకపోయినా... బతుకు బండి నడిపించడానికి సరిపడా సమకూర్చుకుంటున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద కొనుగోలు చేసేందుకు వచ్చేవారు తప్పనిసరిగా గొడుగులు వాడాలంటూ (సామాజిక దూరం పాటించేలా) సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని చోట్ల ఈ ఆదేశాలు తప్పనిసరిగా అమలవుతున్నాయి. కొన్నిచోట్ల ఏదో చూసీ చూడనట్టుగా కూడా ఉంటున్నారు. అయితే, విశాఖ నగరంలోని ఓ వైన్ షాపు వద్ద మాత్రం ఓ వ్యక్తి అలా మద్యం కొనేందుకు వచ్చే వారికి గొడుగులు అద్దెకిస్తూ డబ్బు సంపాదించుకుంటున్నాడు.

corona lockdown, coronaupdate, chinesebioterrorism, maketestingfree, stage3, CoronavirusOutbreak, coronavirus, covid 19, కరోనా లాక్‌డౌన్, కరోనా అప్‌డేట్,
ప్రతీకాత్మక చిత్రం


మద్యం కొనుగోలు కోసం వైన్ షాపునకు వచ్చే వారిలో చాలా మంది ఇంట్లో చెప్పి రారు. ఓ వ్యక్తి ఆఫీసుకు వెళ్తున్నానని భార్యతో చెప్పి దారిలో ఫుల్ బాటిలో కొనుక్కుని ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవచ్చు. అలాంటి వారు గొడుగు పట్టుకుని బయటకు వస్తే భార్యకు అనుమానం వస్తుంది. ఇక ఎప్పుడూ లేనిది కొడుకు గొడుగు పట్టుకుని మరీ ఎండలో బయటకు వెళ్తున్నాడు ఎందుకు? అంటూ యువకుల తల్లిదండ్రులకు కూడా అనుమానాలు వస్తాయి. అలా ఇళ్లలో తెలియకుండా మద్యం తాగే వారికి వైన్ షాపు వద్ద గొడుగు అద్దెకు ఇస్తూ పొట్టపోసుకుంటున్నాడు. ఒక్కో గొడుగుకి కనీసం రూ.20 చొప్పున అద్దె వసూలు చేస్తున్నాడు.

బైక్ మీద లేదా కారులో గొడుగు తీసుకుని వచ్చి మరీ మద్యం కొనుక్కోవడానికి వచ్చేవాళ్లు ఎంతమంది ఉంటారు? ఒకవేళ గొడుగు తీసుకుని వచ్చినా.. మళ్లీ తిరిగి వెళ్లేటప్పుడు ఓ చేతిలో గొడుగు, మరో చేతిలో మద్యం బాటిల్‌తో ద్విచక్ర వాహనాలు నడిపే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఈ గొడుగుల అద్దె స్కీమ్‌ను వారు వినియోగించుకుంటున్నారు. ఎలాగూ లిక్కర్ రేట్లు భారీగానే పెరిగాయి. ఈ గొడుగు అద్దె ఖర్చు కూడా అందులో భాగం అనుకుని చాలా మంది దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు.

గొడుగులు అద్దెకు ఇచ్చే వ్యక్తి తమ ఇంట్లో ఉన్న గొడుగుతో పాటు చుట్టుపక్కల ఉన్న వారిళ్ళలో విరిగిపోయిన గొడుగులను తీసుకొచ్చి వాటికి చిన్న చిన్న రిపేర్లు చేయించి వాటిని ఇలా అద్దెకిస్తున్నాడు.

First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading