Home /News /andhra-pradesh /

VISAKHA GAS LEAKAGE VICTIMS PROTEST IN KGH HOSPITAL SK

కేజీహెచ్‌లో విశాఖ గ్యాస్ లీకేజీ బాధితుల ఆందోళన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వం అందించే రూ.25వేల పరిహారం తమకు వద్దని.. హెల్త్ కార్డులు మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని.. అప్పటి వరకు ఆస్పత్రిలోనే ఉంటామని స్పష్టం చేశారు.

    విశాఖలోని కేజీహెచ్ (కింగ్స్ జార్జ్ హాస్పిటల్)లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం కోలుకున్న బాధితులను ఇళ్లకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రి వద్ద 4 బస్సులను సిద్ధం చేశారు. ఐతే ప్రభుత్వం అందించే రూ.25వేల పరిహారం తమకు వద్దని.. హెల్త్ కార్డులు మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని.. అప్పటి వరకు ఆస్పత్రిలోనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అధికారులు బస్సులను వెనక్కి పంపించారు పంపించారు. అనంతరం పోలీసుల చొరవతో బాధితులంతా ఆస్పత్రిలోని వార్డులకు వెళ్లిపోయారు.

    కాగా, మే 7న విశాఖపట్టణంలో మహా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టెరీన్ గ్యాస్ లీకై 12 మంది చనిపోయారు. వందలాది మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషవాయువును పీల్చడంతో స్థానికులు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషవాయువు ధాటికి పశుపక్షాదులు సైతం చనిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పలు చెట్లు మాడిపోయాయి. గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందజేసింది. అటు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, రెండు మూడు రోజులు చికిత్స అవసరం ఉన్న వారికి రూ. 25 వేలు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేయడంతో.. పశువులు పోగొట్టుకున్న వారికి రూ.20వేల సాయం అందజేస్తామని తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: AP News, Visakha, Visakhapatnam, Vizag gas leak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు