ఒడిశాలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌‌ రైలుకు తప్పిన ప్రమాదం

బోగీలు విడిపోయాయని గ్రహించిన లోకో పైలెట్లు ఇంజిన్‌ను నిలిపివేసి.. మెయింటెనెన్స్ టీమ్‌కు సమాచారం అందించారు.

news18-telugu
Updated: November 2, 2019, 3:29 PM IST
ఒడిశాలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌‌ రైలుకు తప్పిన ప్రమాదం
విడిపోయిన బోగీలు
  • Share this:
భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. ఖుర్దా జిల్లాలోని బాలుగావ్ స్టేషన్ సమీపంలో ఇంజిన్ నుంచి రైలు బోగీలు విడిపోయాయి. రైలు ఇంజిన్ అలాగే కొద్ది దూరం ముందుకు వెళ్లిపోయింది. బోగీలు విడిపోయాయని గ్రహించిన లోకో పైలెట్లు ఇంజిన్‌ను నిలిపివేసి.. మెయింటెనెన్స్ టీమ్‌కు సమాచారం అందించారు. దాదాపు గంట తర్వాత మరమ్మతులు చేశాక రైలు తిరిగి బయలులేరి వెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని.. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. బోగీలు విడిపోయిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
First published: November 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>