హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

No food for Students: ఆకలితో అలమటిస్తున్న గిరిజన విద్యార్థులు.. ఎందుకో తెలుసా..?

No food for Students: ఆకలితో అలమటిస్తున్న గిరిజన విద్యార్థులు.. ఎందుకో తెలుసా..?

గిరిజన విద్యార్థుల ఆకలి కేకలు

గిరిజన విద్యార్థుల ఆకలి కేకలు

No food for students: విశాఖపట్నంలోని ఏజెన్సీ జీకే వీధి మండలంలోని సప్పర్ల బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో గిరిజన విద్యార్థులు ఆకలి కేకలు అధికారులకు వినిపించడం లేదు.. శనివారం నుంచి భోజనం పెట్టకపోతుండటంతో ఆకలి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలేం జరిగింది.

ఇంకా చదవండి ...

  P. Anand Mohan, Visakhapatnam, News18,                                      No food for students:  వారంతా గిరిజన విద్యార్థులు.. పాపం వారి ఆకలి కేలకు అధికారుల చెవులకు ఎక్కడం లేదు.. వారం రోజులు అయినా  ఫుడ్ లేకుండా ఆకలితో అలమటిస్తున్నారు.  విశాఖపట్నం జిల్లా (Visakhapatnam district) ఏజెన్సీ గూడెం కొత్తవీధి మండలం  సప్పర్ల బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో పరిస్థితి ఇది. అక్కడ  శనివారం నుండి ఆకలితో ఉన్న విద్యార్థులు  (Students) ఆకలి బాధలు తట్టుకోలేక పోతున్నారు. దీంతో కొంతమంది విద్యార్థులు ఇంటికి వెళ్లారు. అయినా  విద్యార్థుల ఆకలి బాధలను అధికారులు, ఉపాధ్యాయులు (Teachers) పట్టించుకోవడం లేదు. దీంతో  విద్యార్థులతో కలిసి రహదారిపై ప్రజా ప్రతినిధులు ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు.  అక్కడ 234 మంది విద్యార్థులు మూడు నుంచి పదో తరగతి వరకూ విద్యనభ్యసిస్తున్నారు. అయితే ఇక్కడ రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ప్రధానోపాధ్యాయుడి వార్డెన్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు . పాఠశాల (School)లో విద్యార్థులకు వంటచేయడానికి గ్యాస్ లేనప్పటికీ శనివారం మధ్యాహ్నం ప్రధానోపాధ్యాయుడు ఇంటికి వెళ్లిపోవడంతో గ్యాస్ లేదని వంటసిబ్బంది విద్యార్థులకు వంటచేయడం మానేసారు .  వంటసిబ్బందిలో ఒకరు సెలవుపై ఉండగా , ఒక్కరు మాత్రమే ఉన్నారు . దీంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు.

  దీంతో రెండు రోజుల పాటు విద్యార్థులు  సొంతడబ్బులతో జొన్నపిండి కొనుగోలు చేసుకుని వండుకున్నారు. ఆకలికి తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లిపోయారు.  సోమవారం ఉదయం ఓపిక నశించిన విద్యార్థులు రోడ్డెక్కారు. అయినా అధికారులు అటు వైపు చూడడం లేదు.  ప్రధానోపాధ్యాయుడు తీరుకు వ్యతిరేఖంగా రహదారిపై ఆందోళన చేపట్టారు.

  ఇదీ చదవండి : అమ్మో జెల్లీ ఫిష్.. సాగర తీరంలో కలకలం.. టచ్ చేస్తే అంతే.. ఎందుకంత ప్రమాదం

  అధికారులకు , ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు .

  విషయం తెలుసుకున్న గాలికొండ ఎంపీటీసీ బుజ్జిబాబు , సర్పంచి బుజ్జిబాబు , ఎస్ఎఫ్ ఐ  నాయకులు జీవన్ , సురేష్ లు సప్పర్ల చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్లి కర్రలు సేకరించి విద్యార్థులకు వంటచేశారు. సోమవారం ఉదయం ప్రారంభమైన విద్యార్థులు ఆందోళన కొనసాగుతునే ఉంది.


  ఇదీ చదవండి :  ఆ ఒక్క కార్పొరేషన్ పరిస్థితి ఏంటి..? ఎన్నికలు ఎందుకు జరగడం లేదు?

  విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు కూడా సప్పర్ల చేరుకుని విద్యార్థుల ఆందోళనలో జతకలిసారు. ఇప్పటికైనా అధికారులు కలుగు జేసుకుని.. మరోసారి ఇలాంటి ఇబ్బంది కలుగకుండా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల పిల్లలు ఒక వేళ ఇలా ఆకలితో అలమటిస్తే వారికి ఆ బాధ తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విద్యార్థులు కాబట్టే ఇలా గాలికి వదిలేశారని మండిపడుతున్నారు. కేవలం గ్యాస్ లేదనే నిర్లక్ష్యంతో ఇన్ని రోజులు విద్యార్థులను పస్తులు పెట్టడం  ఏంటని ఆగ్రహ జ్వాలలు ఇప్పటికే ఎగసి పడుతున్నాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Students, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు