HOME »NEWS »ANDHRA PRADESH »viral video netizens like very much cute cow baby from andhra pradesh video on social media nk

Cute Baby Cow: అరుదైన వింత దూడ.. చిత్తూరు జిల్లా ప్రత్యేకం.. వైరల్ వీడియో

Cute Baby Cow: అరుదైన వింత దూడ.. చిత్తూరు జిల్లా ప్రత్యేకం.. వైరల్ వీడియో
అరుదైన వింత దూడ.. (image credit - twitter)

Cute Cow: ఆ దూడను ఓ నిమిషం చూశారంటే... మీకు ఉన్న టెన్షన్లు, ఒత్తిడి, డిప్రెషన్ అన్నీ దూదిపింజల్లా ఎగిరి పోతాయి. నమ్మట్లేదా... వీడియో చూడండి మీకే అర్థమవుతుంది.

  • Share this:
    Baby cow video: సోషల్ మీడియాలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఓ వీడియో ఇప్పుడు సెన్సేషన్ అవుతోంది. అది ఏ రాజకీయ రగడో కాదు... అందమైన, చూడచక్కని వీడియో. ఒకటికి రెండుసార్లు చూడాలనిపించే వీడియో. ఎందుకంటే అందులో ఓ చిన్న దూడ ఉంది. దానికి గంటలు కట్టారు. అది కదులుతుంటే... ఆ గంటలు మోగుతూ... క్యూట్ ఫీల్ కలిగిస్తోంది. అందుకే 50 సెకండ్ల వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు నెటిజన్లు. జనరల్‌గా పిల్లులు, కుక్కల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పులులు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్ల వీడియోలను కూడా మనం ఎంజాయ్ చేస్తుంటాం. ఇది మాత్రం ప్రత్యేకమైన వీడియో.

    ఇది సాధారణ లేగ దూడ కాదు. ఇదో ప్రత్యేకమైన జాతి. చిత్తూరు జిల్లాలోని పంగనూరులో ఈ జాతి ఆవులు ఉంటాయి. ఈ ఆవులు మహా అయితే 3, 4 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరగవు. బరువు కూడా 150 నుంచి 200 కేజీలే ఉంటాయి. కానీ పాలు మాత్రం రోజూ 4 నుంచి 5 లీటర్ల దాకా ఇస్తాయనీ, ఆ పాలు చాలా చిక్కగా ఉంటాయని... వీడియోని షేర చేసిన రాజీవ్ కృష్ణ తెలిపారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా చేస్తున్నారు. అలాగే వైసీపీ కార్యదర్శిగా కూడా ఉన్నారు.




    ఈ వీడియోని చూసిన నెటిజన్లు చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో... ఆ ఆవులను కాపాడాలి అని ప్రత్యేక సూచనలు చేస్తున్నారు.





    ఇది కూడా చదవండి:Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌పై ఎంత సబ్సిడీ వస్తోంది... ఇలా తెలుసుకోండి

    మొత్తానికి ఈ రోజు ఈ వీడియో మనకు ఆనందాన్ని నింపుతోంది. ఇట్లాంటివి రోజూ ఓ నాలుగైదు చూస్తే... మనసుకు హాయిగా ఉంటుందేమో...
    Published by:Krishna Kumar N
    First published:February 17, 2021, 09:22 IST