Tirumala news : వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు... వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Tirumala News | తిరుమలలో త్వరలోనే ఎల్1,ఎల్2,ఎల్3 బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తామని ఆయన అన్నారు. వీఐపీలు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యామ్నాయ విధానం ఆలోచిస్తున్నామని తెలిపారు.

news18-telugu
Updated: July 13, 2019, 6:04 PM IST
Tirumala news : వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు... వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుమల శ్రీవారి ఆలయం
news18-telugu
Updated: July 13, 2019, 6:04 PM IST
సామాన్య భక్తులకు సాధ్యమైనంత తొందరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన టీటీడీ కొత్త చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... ఇందుకు వీఐపీలు సహకరించాలని కోరారు. ప్రముఖులు స్వామివారి దర్శనానికి ఏడాదికి ఒకసారి వస్తే బాగుంటుందని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుమలలో త్వరలోనే ఎల్1,ఎల్2,ఎల్3 బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తామని ఆయన అన్నారు. వీఐపీలు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యామ్నాయ విధానం ఆలోచిస్తున్నామని తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నామని అన్నారు.

తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... ఐసీయూ,వివిధ వార్డుల్లో రోగులను పరామర్శించారు. రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని అన్నారు. టీటీడీ బోర్డులో తీసుకున్న నిర్ణయం ప్రకారం...రూ. 4 కోట్లతో అదనంగా 40 గదుల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. అవినీతి రహిత పాలనలో భాగంగా టీటీడీలో సంస్కరణలు తీసుకొస్తామని అన్నారు.






First published: July 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...