ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 23.29 శాతం మేర ఫిట్ మెంట్ ఇవ్వడంతో పాటు రిటైర్మెంట్ వయసును మరో రెండేళ్లు పెంచారు. దీంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఐతే పీఆర్సీ ప్రకటన సందర్భంగా సీఎం జగన్ (AP CM YS Jagan) వెల్లడించిన కొన్ని విషయాలపై వివాదం రేగుతోంది. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ అంశంపై సీఎం చేసిన ప్రకటనను ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను మోసం చేస్తోందని మండిపడుతున్నారు. రెండేళ్లకు ప్రొబేషన్ ఖరారు చేస్తామని చెప్పి.. ఇప్పుడు వాయిదా వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు నెలలు ప్రొబేషన్ ఖరారు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సీఎం ప్రకటన మరింత అసంతృప్తికి గురిచేసింది.
ప్రొబేషన్ ఖరారును వాయిదే వేయడంపై మండిపడుతున్న గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా అన్ని ప్రభుత్వ వాట్సాప్ మెసెంజర్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అవుతున్నారు. ఉద్యోగాల్లో చేరి రెండేళ్లు పూర్తైనా తమకు ప్రొబేషన్ ఖరారు చేసి పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు.
ఉద్యోగం ఖరారు కాకపోయినా.. ప్రభుత్వ ఉద్యోగాలుగా తమకు కుటుంబాలకు రేషన్ కార్డు రద్దైందని.. అలాగే ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లను రద్దు చేసారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల్లో జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలను తొలగించారని ఆరోపిస్తున్నారు. అలాగే ఫీజు రీయింబర్స్ మెంట్, జగనన్న చేయూత, జగనన్న ఆసరా వంటి ప్రభుత్వ పథకాలను తొలగించి కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వకపోయినా పథకాలు మాత్రం రద్దయ్యాయని చెబుతున్నారు.
చాలీ చాలని జీతం..
సచివాలయం ఉద్యోగులకు ఇచ్చే రూ.15000 తప్ప మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే DA, HRA, ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఏవీ తమకు అమలు కావడం లేదని వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. సామాన్య ప్రజలకు ఇచ్చే బెనిఫిట్స్ కూడా తమకు వర్తించడం లేదని.. దీంతో వీరికి సచివాలయ ఉద్యోగం వీరికి వీరి కుటుంబ సభ్యులకి శాపంగా మారిందన్న చర్చ జరుగుతోంది.
ఒక గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగికి వచ్చే జీతం నెలకు రూ.15000లో రూ.6000 పెట్రోల్ ఖర్చులకే సరిపోతుందన.., మిగిలిన రూ.9 వేలతో తమ కుటుంబాన్ని పోసించుకోలేక శారీరకంగా మానసికంగా ఎంతగానో ఇబ్బందిపడుతున్నట్లు వాపోతున్నారు. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తైతే మంచిరోజులు వస్తాయని భావిస్తున్న తరుణంలో మరో అరు నెలలు పొడిగించారంటూ నిరుత్సాహపడుతున్నారు. ప్రస్తుతం చాలాచోట్ల ఉద్యోగులు అఫీషియల్ సోషల్ మీడియా గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అవుతుండటంతో చర్చనీయాంశమవుతోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Village secretariat