గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షలకు ఏపీపీఎస్సీకి సంబంధం లేదని ఆ సంస్థ చైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు. పరీక్షలను పంచాయతీరాజ్‌శాఖ నిర్వహించిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తమ పరిధిలో లేని అంశాలపైనా అలాగే తాము నిర్వహించని పరీక్షలపై సమాధానం చెప్పలేమని ఆయన అన్నారు. అలాగే పరీక్షల పేపర్ లీకయిందో లేదో తనకు తెలియదని, పంచాయతీరాజ్ శాఖనే అడగండని ఉదయభాస్కర్ చెప్పారు. తమ సంస్థ సతంత్రత కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థ అని అనేక అంశాలు గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. పరీక్షలపై ప్రభుత్వం తమ నుంచి ఎలాంటి నివేదిక కోరలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.అలాగే పరీక్ష పత్రాల తయారీతో పాటు ప్రింటింగ్ వ్యవహారాలను పంచాయతీ రాజ్ శాఖే నిర్వహించిందని.. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఉదయ్‌భాస్కర్ తేల్చిచెప్పారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.