మళ్లీ ఏస్సాడు... లోకేష్‌ని టార్గెట్‌ చేసిన విజయసాయిరెడ్డి

Andhra Pradesh : ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ మెజార్టీతో రాగానే... చంద్రబాబు, లోకేష్ టార్గెట్‌గా వైసీపీ వ్యూహాలు ఉంటాయని రాజకీయ పండితులు అప్పుడే చెప్పారు. ఇప్పుడే అదే జరుగుతోందా?

news18-telugu
Updated: December 2, 2019, 11:29 AM IST
మళ్లీ ఏస్సాడు... లోకేష్‌ని టార్గెట్‌ చేసిన విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి, నారా లోకేష్
  • Share this:
Andhra Pradesh : ఓవైపు "పప్పు" కామెంట్లతో టీడీపీ యువ నేత నారా లోకేష్ సతమతమవుతుంటే... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి... వరుస ట్వీట్లతో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ను టార్గెట్ చేస్తున్నారు. పైపై విమర్శలు కాకుండా ఈసారి ఆయన... ఓ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఏంటంటే... ఇదివరకు టీడీపీ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన లోకేష్... రూ.58 కోట్లను సింగపూర్‌కి తరలించారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. ఆటోల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం ప్రత్యేక యాప్ తయారీకి రూ.58 కోట్లు ఖర్చు చేసినట్లు డ్రామాలాడిన నారా లోకేష్... ఆ డబ్బును సింగపూర్‌కి మల్లించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అంతేకాదు... దీనిపై దర్యాప్తు జరుగుతోందనీ... త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్నట్లుగా ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. మహిళల భద్రతపై బాధపడిపోతున్నట్లు చిట్టి నాయుడు నటిస్తున్నారంటూ... విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ ఆరోపణలే నిజమైతే... అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాబట్టి... నారా లోకేష్‌ అరెస్టయ్యే పరిస్థితి ఉండొచ్చు. అదే ఆరోపణలు అబద్ధమైతే... తనపై చేసిన ఆరోపణలపై లోకేష్ పరువు నష్టం దావా వేస్తే... అది విజయసాయిరెడ్డికి ఇబ్బంది కలిగించే అంశం అవ్వొచ్చు. బట్... ఏం జరగాలన్నా కొంత టైమ్ పట్టే అవకాశాలైతే ఉన్నాయి. అయినప్పటికీ... క్రమంగా టీడీపీపై వైసీపీ ఆరోపణల ఆస్త్రాల్ని పెంచుతున్న సమయంలో ఇలాంటి ట్వీట్ పెట్టడం తమ్ముళ్లలో కలకలం రేపుతోంది. 

కోలీవుడ్‌ని శాసిస్తున్న ఢిల్లీ బ్యూటీ యషికా ఆనంద్


ఇవి కూడా చదవండి :

విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం... వరంగల్‌లో కలకలం

దిశ హత్య కేసులో దోషులకు మరణ శిక్ష విధించే ఛాన్స్...

గుర్రాలకు మాత్రం ఆశలుండవా... రోజూ టీ తప్పనిసరి...

Nutrition In Fish : చేపలు తప్పనిసరిగా ఎందుకు తినాలంటే...

Diabetes Diet : బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే 5 సుగంధ ద్రవ్యాలు...
First published: December 2, 2019, 11:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading