Home /News /andhra-pradesh /

VIJAYAWADA YSRCP WON ELURU MUNICIPAL CORPORATION AS TDP RESTRICTED TO 3 DIVISIONS FULL DETAILS HERE PRN

Eluru Municipal Corporation: ఏలూరు కార్పొరేషన్ వైసీపీ వశం.. టీడీపీ ఆశలు గల్లంతు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మరో మున్సిపల్ కార్పొరేషన్ అధికార వైఎస్ఆర్సీపీ (YSR Congress Party) సొంతం చేసుకుంది.

    ఆంధ్రప్రదేశ్ లో మరో మున్సిపల్ కార్పొరేషన్ అధికార వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన కౌంటింగ్ లో వైసీపీ 44 డివిజన్లు సొంతం చేసుకుంది. ఏలూరు కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉండగా.. గకంతోనే మూ డివిజన్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మరో మూడింటిని టీడీపీ దక్కించుకుంది. వైసీపీ 2, 4, 5, 10, 11, 17, 18, 21, 22, 23, 24, 25, 26, 31, 33, 36, 38, 39, 40, 41, 42, 43, 45, 46, 48, 49, 50 డివిజన్లతో సగా మరికొన్నింటిని వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్ష టీడీపీ 28, 37, 47 డివిజన్లు టీడీపీ దక్కించుకుంది. మార్చి 10న ఎన్నికలు జరగ్గా.. కోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ నిలిపివేశారు. ఇటీవల హైకోర్టు కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆదివారం ఎస్ఈసీ కౌంటింగ్ నిర్వహించింది.

    గెలుపు ఖాయమవడంతో పశ్చిమగోదావరి జిల్లా వైసీపీలో సంబరాలు మొదలయ్యాయి. అప్పుడే మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల గురించి చర్చ జరుగుతోంది. మేయర్ పదవుల గురించి ఇప్పటికే లాబీయింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. మేయర్ పదవిని దక్కించుకునేందుకు జిల్లా నాయకత్వం నుంచి పార్టీ అధిష్టానం వరకు ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే మేయర్ ఎంపిక కొలిక్కివచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.  డిప్యూటీ మేయర్ల పైనా  పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు  తెలుస్తోంది.

    ఇది చదవండి: కొత్త ప్రియుడి మోజులో మహిళ.. పాతప్రియుడ్ని ఇంటికి పిలిపించి దారుణం..


    ఈ ఏడాది మార్చి 10న రాష్ట్రవ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏలూరు మినహా మిగిలిన కార్పొరేషన్లకు కౌంటింగ్ నిర్వహించగా 11 వైసీపీ ఖాతాలో చేరాయి. అలాగే 75 మున్సిపాలిటీల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. తాజాగా ఏలూరు కార్పొరేషన్ వైసీపీ ఖాతాలో చేరింది.

    ఇది చదవండి: పెళ్లికి ముందే ప్రేమాయణం... ప్రియుడ్ని మర్చిపోలేని యువతి ఏం చేసిందంటే..!


    ఏలూరుపై వివాదం ఇదీ..
    గత ఏడాది జనవరిలో చొదిమెళ్ల, కొమడవోలు, వెంకటాపురం, పోణంగి, సత్రంపాడు, శనివారపుపేట, తంగెళ్లమూడి పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ వార్డుల పునర్విభజన జరిగింది. ఐతే విలీనం సమయంలో ఓటర్ల జాబితాలో తప్పులు నమోదయ్యాయని.. అలాగే రిజర్వేషన్ల కేటాయింపుల్లోనూ ఇబ్బందులున్నాయని ఏలూరుకు చెందిన చిరంజీవి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఓటర్ల జాబితాలో పొరబాట్లు, రిజర్వేషన్లలో చోటు చేసుకున్న తప్పులను సవరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని హైకర్టు స్పష్టం చేసింది. దీనిని ప్రభుత్వం, ఎస్ఈసీ సవాల్ చేయగా.. ఎన్నికల నిర్వహణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Eluru, Municipal Corporations

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు