హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ysrcp mlc karimunnisa : వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్సిసా హఠాన్మరణం -అసెంబ్లీ నుంచి తిరిగొచ్చాక ఇలా..

ysrcp mlc karimunnisa : వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్సిసా హఠాన్మరణం -అసెంబ్లీ నుంచి తిరిగొచ్చాక ఇలా..

వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్సిసా (పాత ఫొటోలు)

వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్సిసా (పాత ఫొటోలు)

అసెంబ్లీ సమావేశాల నుంచి ఇంటికి వచ్చిన కాసేపటికే ఎమ్మెల్సీ కరీమున్సిసా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు ఆమెను విజయవాడలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కరీమున్సిసా మృతి చెందారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెను వివాదాలు చెలరేగడం, మరోవైపు మండలిలో అధికర పక్షానికి గొప్ప ఊరట లభించిన శుక్రవారం నాడే వైసీపీ(YSRCP) విషాదానని చవిచూడల్సి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్సిసా(65) హఠాన్మరణం చెందారు. కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్సీ (MLC)గా ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీమున్సిసా.. శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరిట వివాదం చెలరేగడం, ఇన్నాళ్లూ టీడీపీ ఆధిపత్యంలో ఉన్న శాసన మండలి శుక్రవారంతో వైసీపీ వశం కావడం, ఆ పార్టీ ఎమ్మెలసీ మోషన్ రాజు మండలి చైర్మన్ గా శుక్రవారమే బాధ్యతలు స్వీకరిచడం తెలిసిందే. మండలిలో కొత్త చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్సీ కరీమున్సిసా.. రాత్రికి విజయవాడలోని తన ఇంటికి చేరుకున్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో..

అసెంబ్లీ సమావేశాల నుంచి ఇంటికి వచ్చిన కాసేపటికే ఎమ్మెల్సీ కరీమున్సిసా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు ఆమెను విజయవాడలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కరీమున్సిసా మృతి చెందారు. కాగా, ఎమ్మెల్సీ హఠాన్మరణానికి గుండెపోటే కారణమని డాక్టర్లు నిర్ధారించారు. రాత్రి 11.30 సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబీకులు ఆమెను.. విజయవాడలో రెండు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.

China : మరో 18 ప్రమాదకర వైరస్‌లు -చైనా మాంసం మార్కెట్లలో గుర్తించిన సైంటిస్టులు


విజయవాడకు చెందిన సాధారణ వైసీపీ కార్యకర్త కరీమున్సిసా గతంలో 54వ వార్డు కార్పొరేటర్‌గా పనిచేశారు. కార్పొరేటర్ గా ఉన్న సమయంలోనే ఆమెకు సీఎం జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కృష్ణా జిల్లా నుంచి మైనార్టీ కోటాలో కరీమున్సిసాకు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్‌, శాసనమండలి కొత్త చైర్మన్‌ మోషేన్‌ రాజును కలిశారు. కానీ రాత్రి అనూహ్య రీతిలో కన్నుమూశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు.

shocking : మనవరాలి శవం పక్కనే.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం -కసి ఈనాటిది కాదంటూ..


ఎమ్మెల్సీ కరీమున్సిసా మృతితో వైసీపీలో విషాదం నెలకొంది. విజయవాడలోని పలువురు నేతలు కరీమున్సిసా ఇంటికి వెళ్లి ఆమె పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, పార్టీ కీలక నేతలు ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. కరీమున్సిసా అంత్యక్రియలు శనివారం విజయవాడలోనే జరిగే అవకాశాలున్నాయి.

First published:

Tags: Death, Vijayawada, Ysrcp

ఉత్తమ కథలు