Home /News /andhra-pradesh /

VIJAYAWADA YOUNG WOMEN IN ANDHRA PRADESH ARE FACING HARASSMENT ON SOCIAL MEDIA AFTER THEY SHARING PERSONAL PHOTOS FULL DETAILS HERE PRN GNT

Vijayawada News: ఆన్ లైన్లో ఫ్రెండ్ షిప్.. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. కేటుగాళ్ల కొత్త దందా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా (Social Media) స్నేహాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కనీసం ముఖపరిచయం లేనివారు కూడా ఫేస్ బుక్(Facebook), ఇన్ స్టాగ్రామ్ (Instagram) లో ఫ్రెండ్స్ గా మారిపోతున్నారు. అక్కడితో ఆగుతున్నారా.. చాటింగ్ లు, షేరింగ్ లతో సాగిపోతున్నారు.

ఇంకా చదవండి ...
    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా (Social Media) స్నేహాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కనీసం ముఖపరిచయం లేనివారు కూడా ఫేస్ బుక్(Facebook), ఇన్ స్టాగ్రామ్ (Instagram) లో ఫ్రెండ్స్ గా మారిపోతున్నారు. అక్కడితో ఆగుతున్నారా.. చాటింగ్ లు, షేరింగ్ లతో సాగిపోతున్నారు. ఆ తర్వాత పర్సనల్ ఫోటోలు షేర్ చేసుకోవడంతో అసలు కథ అడ్డం తిరుగుతోంది. తొలుత సంతోషంతో మొదలయ్యే ఆన్ లైన్ స్నేహం ఆ తర్వాత జీవితాలని నాశనం చేస్తోంది. ముఖ్యంగా యువతుల విషయంలో ఫేస్ బుక్ స్నేహాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. తొలుత ఫ్రెండ్ షిప్ ఆ తర్వాత లవ్ పేరుతో వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఒప్పుకుంటే సరి లేకుంటే మార్ఫింగ్ ఫోటోలతో మాయ చేయడం అవసరాలు తీర్చుకోవడం జరుగుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి నేరాలు తరచూ వెలుగు చూస్తున్నాయి.

    సైబర్ నేరగాళ్లు, కేటుగాళ్ల వేధింపులు భరించలేక కొందరు చదువులు, ఉద్యోగాలు మానేస్తుంటే మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత ఫోటోల విషయంలో యువతులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇటీవల కృష్ణా జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. గూడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి డిగ్రీ చదువుతోంది. ఆన్ లైన్లో ఓ పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండేదు. అందులో భాగంగా ఓ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంది. ఐతే యాప్ వివరాలను ఫేస్ బుక్ స్టేటస్ లో పెట్టింది.

    ఇది చదవండి: ఫేస్ బుక్ ప్రేమ.. పెళ్లి.. ఎనిమిది నెలలు తిరిగే సరికి సీన్ రివర్స్.. పాపం సమంత..


    దీనిని చూసిన తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు గణేష్.. తాను కూడా యాప్ ను ప్రమోద్ చేస్తాననంటూ ఆమెకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. దీంతో ఆమె యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె ఫోటోలను డౌన్ లోడ్ చేసుకొని మార్ఫింగ్ చేశాడు. ఫోటోపై ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు పెట్టి కాల్ గర్ల్ కావాలంటే ఈ నెంబర్ కు ఫోన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదేంటని ప్రశ్నిస్తే.. ఫోటోలు తొలగించాలంటే న్యూడ్ వీడియో కాల్ చేయాలని బెదిరించాడు. దీంతో ఆమె అలాగే చేసింది. ఆ కాల్ ను రికార్డ్ చేసిన యువకుడు.. అడిగినంత డబ్బులివ్వకపోతే వీడియో ఇంటర్నెట్ లో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే విజయవాడకు చెందిన ఓ యువతిని ఇన్ స్టాగ్రామ్ లో జరిగిన ఘటనకు ఆమెను ఏకంగా కాలేజీ నుంచి తప్పించారు.


    ఇది చదవండి: ఒక్క ఆన్ లైన్ గేమ్.. రూ.2లక్షలు మాయం.. యువకుడి కథ విషాదాంతం


    ఇటీవల నమోదయిన ఇలాంటి కేసుల్లో ఐదుగురు యువతులు ఉద్యోగాలను వదిలేయాల్సి వచ్చింది. చాలా మంది పరువు పోతుందనే భయంతో మిన్నకుండిపోతున్నారు. యువతులు, విద్యార్థినులు, మహిళలు తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు ఆలోచించుకోవాలని.. పొరబాటున పోకిరీగాళ్లకు ఆ ఫోటోలు చిక్కితే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Blackmail, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు