Home /News /andhra-pradesh /

VIJAYAWADA YOUNG WOMAN MYSTERIOUS DEATH RAISING MANY QUESTIONS AS PARENTS MADE ALLEGATIONS ON BOY FRIEND FULL DETAILS HERE PRN

Death Mystery: వీడని సింధు డెత్ మిస్టరీ.. ప్రియుడే చంపాడా..? మధ్యలో ఆమె ఎవరు..?

సింధు

సింధు

విజయవాడలో (Vijayawada) సంచలనం సృష్టించిన సీఏ విద్యార్ధిని సింధు అనుమానాస్పద మృతి కేసు ఇంకా మిస్టరీగానే ఉంది.

    విజయవాడలో సంచలనం సృష్టించిన సీఏ విద్యార్ధిని సింధు అనుమానాస్పద మృతి కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. ఆమె మృతికి ప్రియుడే కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశాయి. విచారణలో వేళ్లన్నీ సింధు ప్రియుడు ప్రసేన్ వైపే చూపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రసేన్ సింధును హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సింధు కుటుంబ సభ్యులు కూడా అతడిపైనే ఆరోపణలు చేస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం సింధు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సింధు ప్రియుడు ప్రసేన్.. కొంతకాలంగా వేరే యువతితో సంబంధం పెట్టుకున్నాడని.. పెళ్లి చేసుకోమని బలంవంతం చేసినందుకే సింధుని పొట్టనబెట్టుకున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.సింధుని వదిలించుకోని తాను ప్రేమించిన యువతిని ప్రసేన్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడని..అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్తున్నారు.

    మరోవైపు సింధు మృతదేహం పడిఉన్న తీరు కూడా పలు అనుమానాలు కలిగిస్తున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఉరికి వేలాడుతుంటాలి గానీ గాయాలతో నెలపై పడి ఉంది. అలాగే ముక్కు నుంచి తీవ్రంగా రక్తం కారుతున్న స్థితిలో ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగానే కేసు నమోదు చేయగలమని.. శరీరంపై బలమైన గాయాలున్నట్లు తేలితే అనుమానాస్పద మృతి కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. దీనిపై ఇప్పటికే సింధు ప్రియుడు ప్రసేన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

    తండ్రిలాంటి వాడని అతడి బైక్ ఎక్కింది.. కానీ ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేకపోయింది..



    అసలేం జరిగింది..?
    కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన చెరుకూరి వెంకటేశ్వరరావు కుమార్తె సింధు సీఏ పూర్తి ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. సింధు, ప్రసేన్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రసేన్.. గత ఏడాది లాక్ డౌన్ సమయం నుంచి గుణదలలోని గంగిరెద్దుల దిబ్బ ప్రాంతంలోని తన ఇంట్లో ఉంచాడు. ఆమె అక్కడ ఒంటరిగా ఉంటూనే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా సింధు ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె తల్లిదండ్రులు ప్రసేన్ కు ఫోన్ చేసి ఏం జరిగిందో చూడాలని చెప్పగా.. అక్కడికి తలపుకొట్టాడు. ఎంతసేపు తలుపు కొట్టినా తియకపోవడంతో కిటికీలో నుంచి చూడగా సింధూ అచేతనంగా పడిఉంది. దీంతో ప్రసేన్ జరిగిన విషయాన్ని సింధు తల్లిదండ్రులకు చెప్పాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న సింధు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను ప్రసేన్ హత్య చేశాడని అతడ్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Vijayawada

    తదుపరి వార్తలు