హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అమెరికా సంబంధమంటే ఆనందపడ్డారు.. పెళ్లవుతుంది కదా అని ఛాన్స్ తీసుకున్నాడు.. చివరికి ఊహించని ట్విస్ట్..

అమెరికా సంబంధమంటే ఆనందపడ్డారు.. పెళ్లవుతుంది కదా అని ఛాన్స్ తీసుకున్నాడు.. చివరికి ఊహించని ట్విస్ట్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Vijayawada: ఇటీవల జరుగుతున్న నేరాల్లో మ్యాట్రిమోనీ సైట్లలో ఘరానా మోసాలు మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు కేటుగాళ్లు నకిలీ ప్రొఫైల్స్‌ అప్‌లోడ్‌ చేసి.. పెళ్లి పేరుతో మోసం చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  మోసాలు పలువిధాల సైబర్ మోసాల (Cyber Crime)  గురించి పోలీసులు ఎన్ని రకాలుగా ప్రజలను జాగృత పరిచినా సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ప్రజల బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకొని తమ పని కానిచ్చేస్తున్నారు. ఆఖరకు చదువుకున్నవారు కూడా ఈ మోసాలకు బలవుతున్నారు. టెక్నాలజీ పెరగడంతో.. అదే స్థాయిలో మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొత్త కొత్త దారుల్లో కేటుగాళ్లు అమాయకులను నిండా ముంచేస్తున్నారు. ఆన్ లైన్ వేదికగా జరిగి ప్రతి వ్యవహారాన్ని మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాజాగా మాట్రిమోనీ సైట్‌లను కూడా వదలటం లేదు ఈ కేటుగాళ్లు. ఇటీవల జరుగుతున్న నేరాల్లో మ్యాట్రిమోనీ సైట్లలో ఘరానా మోసాలు మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు కేటుగాళ్లు నకిలీ ప్రొఫైల్స్‌ అప్‌లోడ్‌ చేసి.. పెళ్లి పేరుతో మోసం చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు.

  ఆడపిల్లల తల్లితండ్రుల బలహీనతలను వారు తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. వారి ఆశలు పెట్టుబడిగా చేసుకున్ని.. అమెరికా సంబంధం అంటూ మొదట పరిచయం చేసుకుంటున్నారు. తరువాత వివిధ రూపాల్లో దొరికినంత దోచేస్తున్నారు. ఇటీవల తెలంగాణ సైబర్ పోలీసుల (Telagnana Cyber Crime Police) నుండి విజయవాడ (Vijayawada) దేవినగర్‌కు చెందిన యువతికి ఫోన్ వచ్చింది. వారు తాను చేసుకోబోయే వ్యక్తి శ్రీకాంత్ గురించి ఆరా తీయగా అసలు రంగు బయటపడింది.

  ఇది చదవండి: సాఫ్ట్ వేర్ జాబ్.. మంచి జీతం.. కానీ యువకుడి సమస్య అదే.. అందరూ చూస్తుండగానే ఘోరం

  యువతీ ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తన వివాహం కోసం పేరొందిన మాట్రిమోనీ సైట్‌లో నమోదు చేసుకుంది. ఈ క్రమంలో విశాఖపట్నంకి చెందిన శ్రీకాంత్ ఆ యువతిని సంప్రదించాడు. తనది వైజాగ్ అని.. ప్రస్తుతం ఆస్ట్రాజెనికా ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నానని త్వరలో ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్తున్నానని ఆ యువతీ నమ్మించాడు.

  ఇది చదవండి: పెళ్లి చూపుల్లో ఆ మాట అనేసరికి తట్టుకోలేకపోయింది.. చేతి నిండా గాజులు వేసుకొని అంతపని చేసింది

  త్వరలో పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి.. అమెరికా వెళ్లేందుకు పేపర్లు రెడీ చేసుకోవాలని సూచించాడు. వీసా కోసం బ్యాంక్ డిపాజిట్ చూపించలని.. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండాలని నమ్మించ యువతితో పాటు ఆమె సోదరుడు, తండ్రి చేత క్రెడిట్ కార్డులు, ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకునేలా కోటి రూపాయలకు పైగా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.

  డబ్బు అందిన తర్వాత యువతి ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసుల నుంచి వచ్చిన ఫోన్ తో శ్రీకాంత్ బండారం బయటపడింది. దీంతో లబోదిబోమంటూ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో అలాంటి ఘటనే జరిగింది. అప్పుడు కూడా ఓ వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయం చేసుకొని ఓ యువతిని మోసం చేశాడు. అతడి పేరు శ్రీకాంత్ కాగా. ఊరు విశాఖపట్నంగా తెలుస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Cheating, Vijayawada

  ఉత్తమ కథలు