VIJAYAWADA YOUNG WOMAN ATTEMPTED TO SUICIDE IN VIJAYAWADA POLICE COMMISSIONER OFFICE FULL DETAILS HERE PRN
Ex.Lovers: పెళ్లైన నెలరోజుల తర్వాత మాజీ ప్రియుడి ఫోన్... యువతి చేసిన పనికి అంతా షాక్..
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణాజిల్లా (Krishna District) పెనమలూరు మండలం కానూరుకు చెందిన ఓ యువతికి... కొంతకాలం క్రితం తెలంగాణ (Telangana)లోని సంగారెడ్డికి చెందిన సులేమాన్ అనే యువకుడితో వాట్సాప్ (What’s App) ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అతడ్ని పూర్తిగా నమ్మింది.
ఈ రోజుల్లో ప్రేమలు ఎలా పుడుతున్నాయో.. యువతీ యువకులను ఎంతవరకు తీసుకెళ్తున్నాయో.. చెప్పలేని పరిస్థితి. సోషల్ మీడియా, ఫోన్లు, చాటింగులతో మొదలయ్యే బంధాలు జీవితాలను ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అలా వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచయమైన యువకుడి ప్రేమలో పడిన ఓ యువతి దారుణంగా మోసపోయింది. అనేక ట్విస్టుల తర్వాత ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కృష్ణాజిల్లా (Krishna District) పెనమలూరు మండలం కానూరుకు చెందిన ఓ యువతికి... కొంతకాలం క్రితం తెలంగాణ (Telangana)లోని సంగారెడ్డికి చెందిన సులేమాన్ అనే యువకుడితో వాట్సాప్ (What’s App) ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అతడ్ని పూర్తిగా నమ్మింది.
అతడు సౌదీలో ఉండటంతో అవసరమని అడగ్గా రూ.1.5లక్షలు ఇచ్చింది. మూడేళ్ల క్రితం అతడు విజయవాడ వచ్చి యువతితో కలిసి తిరిగాడు. ఆ సందర్భంగా ఇద్దరూ కలిసి ఫోటోలుకూడా దిగారు. ఆ తర్వాత పెళ్లి మాట ఎత్తేసరికి సాకులు చెబుతూ వస్తున్నాడు. ఐతే యువతికి కుటుంబ సభ్యులు నెల రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లిచేశారు. పెళ్లైన తర్వాత సులేమాన్.. ఫోటోలు, వీడియోలు చూపించి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.
దీంతో యువతి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా అతడి వేధింపులు ఆగకపోవడంతో కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చి చీమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు వెంటనే ఆమెను అడ్డుకున్నారు. ఆత్మహత్యాయత్నం కింద ఆమెపై కేసు నమోదు చేశారు. తనను వేధిస్తున్న సులేమాన్ పై చర్యలు తీసుకోనందునే ఇలా చేసినట్లు యువతి చెప్పినట్లు సమాచారం.
గతంలో విజయవాడకు (Vijayawada) చెందిన ఓ డిగ్రీ విద్యార్థినికి కాలేజీలో పరిచయమైన రోహిత్ అనేయువకుడ స్నేహం పేరుతో ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ ముగ్గులోకి దించాడు. ఓ రోజు చాటింగ్ చేస్తూ న్యూడ్ వీడియోలు కావాలని అడగటంతో ప్రేమించిన వాడే కదా అని వాటిని పంపింది. ఐతే కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. ఐతే తనకు బ్రేకప్ చెప్పిందన్న కోపంతో యువతిపై కక్ష పెంచుకున్న సదరు యువకుడు వాటిని ఓ ఫ్రెండ్ సాయంతో న్యూడ్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.