VIJAYAWADA YOUNG TECHIE COMMITS SUICIDE AFTER LOST MONEY TO ONLINE CHEATER IN GUNTUR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Girl Suicide: ప్రేమ వ్యవహారం లేదు.. పని ఒత్తిడి లేదు.. యువతి ఆత్మహత్యకు కారణం తెలిసి షాకైన పోలీసులు..
శ్వేత చౌదరి (ఫైల్)
Guntur Girl: ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు (Online Cheating) ఎక్కువయ్యాయి. ఇలాంటి మోసాల బారిన పడుతున్న బాధితుల్లో చదురానివారి కంటే బాగా చదువుకున్నవారే ఎక్కువమంది ఉంటున్నారు. అన్నీ తెలిసినా మోసగాళ్ల మాయలో పడి డబ్బులు పొగొట్టుకుంటున్నారు. కొంతమంది ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు (Online Cheating) ఎక్కువయ్యాయి. ఇలాంటి మోసాల బారిన పడుతున్న బాధితుల్లో చదురానివారి కంటే బాగా చదువుకున్నవారే ఎక్కువమంది ఉంటున్నారు. అన్నీ తెలిసినా మోసగాళ్ల మాయలో పడి డబ్బులు పొగొట్టుకుంటున్నారు. కొంతమంది ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) లో ఇలాంటి ఘటనే జరిగింది. మంగళగిరి మండలం నవులూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్వేతా చౌదరి.. కొంతకాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. తాను పనిచేస్తున్న సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేయడంతో ఆదివారం ఉదయం కారులో హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం బైక్ వేసుకొని ఇంటి నుంచి వెళ్లింది.
రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని చిల్లకల్ల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. ఈ వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే చిల్లకల్లు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రంతా శ్వేత కోసం గాలించగా.. ఆదివారం ఉదయం పది గంటల సమయంలో మృతదేహం కనిపించింది. ఐతే ఆమె ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అసలు విషయం తెలిసి అంతా షాక్ కు గురయ్యారు. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమో లేక ఉద్యోగంలో ఒత్తిడో కాదు.
శ్వేతా చౌదరి బిటెక్ పూర్తిచేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. నిత్యం ఆన్ లైన్లో ఉండే శ్వేత.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తుండేది. ఈ క్రమంలో ఓ అపరిచత వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. సదరు వ్యక్తి లక్షా 20వేలు చెల్లిస్తే.. నీకు ఏడు లక్షలిస్తానని శ్వేతా చౌదరిని నమ్మించాడు. ఆమె తనదగ్గర డబ్బులు లేవని చెప్పడంతో అతడే రూ.50వేలు శ్వేతకు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ రూ.50వేలతో కలిపి మిగిలిన డబ్బులను ఆమెతోనే కట్టించాడు. ఆ తర్వాత కూడా ఆమె రూ.1.30 లక్షలు చెల్లించింది.
రెండు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రాడవంతో తాను మోసపోయానని గ్రహించింది. ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఆమె ఫోన్ కాల్ డేటాతో పాటు డబ్బులు పంపిన ఎకౌంట్ వివరాలు, సోషల్ మీడియా ఫ్రెండ్స్ లిస్టును పోలీసులు సేకరిస్తున్నారు. బాగా చదువుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ కూడా ఆన్ లైన్ మాయగాళ్ల ఉచ్చులో పడటం చర్చనీయాంశమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.