హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Business Woman: బాబు పుట్టగానే తట్టిన ఐడియా.. ఇప్పుడో పెద్ద బిజినెస్ అయింది.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..!

Business Woman: బాబు పుట్టగానే తట్టిన ఐడియా.. ఇప్పుడో పెద్ద బిజినెస్ అయింది.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..!

జ్యోతి శ్రీ

జ్యోతి శ్రీ

హెల్త్ మిక్స్, పాల పౌడర్లు లేని సమయంలో మన పూర్వీకులు ఏం చేసేవారు..? ఎలాంటి హెల్త్ మిక్స్ లను ఉపయోగిచే వారని సందేహం రాక మానదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని మల్కిపురానికి చెందిన జ్యోతి శ్రీ కి ఇలాంటి ఆలోచనే వచ్చింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  పిల్లల నుంచి పెద్దల వరకు నిత్యం పౌష్ఠిక ఆహారం తీసుకుంటూ ఉంటాం. ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ పౌడర్, ఇతర హెల్త్ మిక్స్ అంటూ నెలల చిన్నారుల నుంచి... పెద్ద వారి వరకు ఎడాపెడా తాగేస్తుంటాం. ఇలా రోజు హెల్త్ మిక్స్ తీసుకుంటున్న వారి సంఖ్యా అధికమే. అవన్నీ ఇతర కెమికల్స్, మనిషి ఆరోగ్యానికి అవసరం లేను వ్యర్ధాలు సైతం ఈ హెల్త్ మిక్స్ లో ఉంటున్నాయి. ఇలాంటి హెల్త్ మిక్స్, పాల పౌడర్లు లేని సమయంలో మన పూర్వీకులు ఏం చేసేవారు..? ఎలాంటి హెల్త్ మిక్స్ లను ఉపయోగిచే వారని సందేహం రాక మానదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని మల్కిపురానికి చెందిన జ్యోతి శ్రీ కి ఇలాంటి ఆలోచనే వచ్చింది. పిల్లలకు, పెద్దవారికి అలనాటి కాలంలో ఎలాంటి పౌష్ఠిక ఆహారాన్ని తీసుకొనే వారో... అమ్మమ్మా.. నాన్నమ్మలను అడిగి తెలుసుకుంది. అలా తెలుసుకున్న పద్ధతుల తో ఓ స్టార్టప్ ను ప్రారంభించేలా చేసింది.

  విజయవాడ (Vijayawada) లో ఉంటున్న జ్యోతి శ్రీ తన బాబు కాన్పుకు స్వగ్రామం మల్కిపురానికి వెళ్ళింది పండంటి బాబును ప్రసవించింది. ఆరో నెల అన్న ప్రాసన చేసింది అందరిలా తన బాబుకు బయట దొరికే న్యూట్రిషన్ పౌడర్‌లకు బదులు మన పూర్వీకులు పిల్ల ఎదుగుదల ఎలాంటివి వినియోగించేవారో ఆరా తీసింది. రోగనిరోధక శక్తి పెరుగుదలకు సంపూర్ణ పోషణను అందించేందుకు ఏమి తినిపించేవారో తెలుసుకొని.., ఆలా తన బాబుకు సేంద్రియ సాంప్రదాయ పద్దతుల్లో తయారు చేసిన పొడులను తయారు చేసింది. తన నానమ్మ సహాయంతో డక్కరి, ఉగ్గు, వంటివి తాయారు చేసి తన బాబుకు అందించింది జ్యోతిశ్రీ. బాబు ఇమ్యూనిటీ పవర్ చూసి స్నేహితులు అడగటంతో వారికీ కొంత ఇచ్చింది. పిల్లల ఎదుగుదలకు పూర్వ పద్ధతులు బాగుండటంతో మళ్ళి మళ్ళి అడుగుతుండటంతో తానే న్యూట్రీట్ పేరుతో ఒక స్టార్టరప్ ను స్థాపించింది.

  ఇది చదవండి: అక్కడ పుస్తకాలన్నీ సగం ధరకే..! A to Z ఏ పుస్తకం కావాలన్నా దొరుకుతుంది..!

  మన పూర్వికులు వాడి మనం వదిలేసిన ఆహారపు అలవాట్లతో మొదట 2 రకాలతో ప్రారంభించిన జ్యోతిశ్రీ అతి తక్కువ కాలంలోనే 80 స్టాండర్డ్ రకాలు మరియు ఎనిమిది వేల కస్టమైజేషన్ రకాల హెల్త్ ప్రిమిక్స్ ను అందించే స్థాయికి ఎదిగింది. న్యూట్రీట్ హెల్త్ ప్రిమిక్స్ ను పూర్తి పూర్వీకులు ఆచరించిన పద్దతుల్లోనే అంటే తిరగలి, రోట్లో దంచటం లాంటి పూర్తి సాంప్రదాయ పద్ధతుల్లో తయారు చేయడం మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయా ప్రాంతాల పూర్వీకుల ఆహారపు అలవాట్లను ఆచరిస్తూ తాను హెల్త్ ప్రిమిక్స్ ను తయారు చేస్తున్నారు. తమ వద్ద పని చేసే మహిళలకు అనువుగా ఉండేలా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మాత్రమే పని గంటలు ఉండేలా ఏర్పాటు చేసింది జ్యోతిశ్రీ. మిగిలిన సమయంలో వారివారి అనుకూలతను బట్టి పని చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇలా సాంప్రదాయ హెల్త్ ప్రిమిక్స్ తో దేశవ్యాప్తంగానే కాకుండా.. విదేశాల్లో నివసించే భారతీయులకు కూడా ప్రాచీన ఆహారపు అలవాట్లను పరిచయం చేస్తోంది జ్యోతి శ్రీ.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Business woman, Vijayawada

  ఉత్తమ కథలు