హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: రెండు రోజుల్లో పెళ్లి.. పెళ్లికొడుకు జంప్.. ఈ కథలో ట్విస్టులెన్నో..

Andhra Pradesh: రెండు రోజుల్లో పెళ్లి.. పెళ్లికొడుకు జంప్.. ఈ కథలో ట్విస్టులెన్నో..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

రెండు రోజుల్లో పెళ్లనగా.. పెళ్లికొడుకు అదృశ్యమయ్యాడు. కేసులు విచారించిన పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురయ్యాయి.

  అబ్బాయి పెళ్లీడుకొచ్చాడు.. దీంతో తల్లిదండ్రులు ఓ మంచి అమ్మాయితో పెళ్లి కుదిర్చారు. నిశ్చితార్థం అయింది. పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులకు శుభలేఖలు పండటంతో పాటు మండపాలు, పెళ్లి దుస్తులు ఇలా అన్నీ కొనేశారు. అటు అమ్మాయి కూడా పెళ్లి, కొత్తజీవితం గురించి కలలు కంటోంది. అంతా బాగుందనుకునే సమయంలో ఊహించని ట్విస్ట్. అబ్బాయి మిస్సింగ్. పనిమీద బయటకువెళ్లిన వాడు తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఐతే పెళ్లికొడుకు మిస్సింగ్ పై ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. అసలు ఆ యువకుడు ఏమయ్యాడు..? ఎక్కడున్నాడు..? పెళ్లి నాటికి తిరిగొస్తాడా..? అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా పెడన మండలం చేవేండ్రపాలెంకు చెందిన యువకుడు కటకం వీరాంజనేయులుకి మచిలీపట్నంకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. మే 13న పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు.

  ఇంటిల్లిపాది పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన బయటకు వెళ్లిన వీరాంజనేయులు మళ్లీ తిరిగిరాలేదు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తెలిసిన వారి వద్ద విచారణ జరిగిన తండ్రి వెంకటేశ్వరరావు.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే యువకుడు అదృశ్యం ఘటన గ్రామంలో కలకలం రేపింది. మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేయగా.. యువకుడు భారీగా నగదుతో పరారైనట్లు తేలింది. ఎల్ అండ్ టీ సంస్థలో కాంట్రాక్టులు చేస్తున్నట్లు బంధువుల, స్నేహితులతో పాటు గ్రామస్తులను నమ్మించిన ఆంజనేయులు.. అధిక వడ్డీల పేరుతో భారీగా నగదు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓస్థానిక ప్రజాప్రతినిథి నుంచి రూ.5లక్షలు తీసుకొని తక్కువ వ్యవధిలో రెట్టింపు మొత్తం ఇవ్వడంతో స్థానికులంతా మనోడి వలలో పడ్డారు.

  ఇది చదవండి: 5 నిముషాల ఆలస్యం.. 11 ప్రాణాలు బలి.. రుయా విషాదానికి బాధ్యులెవరు..?


  దీంతో చేవేంద్రపాలెం, చేవెండ్ర, చెన్నూరు, ఉప్పలకలవగుంటపాలెం గ్రామాలకు చెందిన రైతులు ఇతనికి భారీగా డబ్బులు ఇచ్చారు. ఇలా దాదాపు రూ.1.50 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఐతే పోలీసులు మాత్రం రూ.70 లక్షలు వసూలు చేసినట్లు చెప్తున్నారు. ఐతే ఇందుకు రుణఒత్తిడే కారణమా..? లేక ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని పెడన పోలీసులు క్యాష్ చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ కానిస్టేబుల్ ఆంజనేయులు కాల్ డేటాలో మీ నెంబర్ ఉందంటూ గ్రామస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. విచారణ పేరుతో కొందరిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

  ఇది చదవండి: ఏపీలో e-Pass పొందాలంటే ఇలా చేయండి.. గంటలో పర్మిషన్ గ్యారెంటీ...

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Cheating case, Krishna District, Machilipatnam, Vijayawada

  ఉత్తమ కథలు