VIJAYAWADA YOUNG MAN BOOKED FOR TRYING TO SALE CHILD ABUSIVE CONTENT IN VIJAYAWADA OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Vijayawada: ఇంజనీరింగ్ చదివి ఇదేం పోయేకాలం..? పైత్యం పీక్స్ చేరి పోలీసులకు చిక్కాడు..!
ప్రతీకాత్మకచిత్రం
అతడు ఇంజనీరింగ్ (Engineering) పూర్తి చేశాడు. ఉద్యోగం కూడా సంపాదించాడు. కానీ జీతం సరిపోలేదు. దీంతో ఉద్యోగం కూడా మానేశాడు. మరోకొత్త జాబ్ వెతుక్కోవాల్సిన వాడు కాస్తా.. పోర్న్ వీడియో (Porn Videos) లు చూడటం అలవాటు చేసుకున్నాడు.
అతడు ఇంజనీరింగ్ (Engineering) పూర్తి చేశాడు. ఉద్యోగం కూడా సంపాదించాడు. కానీ జీతం సరిపోలేదు. దీంతో ఉద్యోగం కూడా మానేశాడు. మరోకొత్త జాబ్ వెతుక్కోవాల్సిన వాడు కాస్తా.. పోర్న్ వీడియో లు చూడటం అలవాటు చేసుకున్నాడు. పైత్యం పీక్స్ కు చేరిందో ఏమో.. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు కొనుగోలు చేశాడు. అనంతరం వాటిని అమ్మకానికి పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. ఇటీవల దేశవ్యాప్తంగా చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రోత్సహించే నేరాలకు పాల్పడుతున్నవారిని సీబీఐ అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని విజయవాడ (Vijayawada) కు చెందిన యువకుడు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని ఫకీర్ గూడెంకు చెందిన సోహైల్ అనే యువకుడు సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పలు ఉద్యోగాలు చేసి జీతం సరిపోవక మానేశాడు. ఖాళీగా ఉన్న సమయంలో మొబైల్ ఫోన్లో ఫోర్న్ వీడియోలు చూస్తుండేవాడు.
క్రమంలో ఓ సోషల్ మీడియా (Social Media) గ్రూప్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు అమ్ముతామనే ప్రకచన చూసి క్లిక్ చేశాడు. రూ.250 చెల్లించడంతో అవతలి వ్యక్తి 4వేల వీడియోలుండే లింక్ పంపాడు. వాటిని ఎక్కువ ధరకు ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని భావించాడు సోహైల్. ఐడియా వచ్చిందే తడవుగా వాటిని రూ.500కు ఆన్ లైన్లో అమ్మకానికి పెట్డాడు. ఈ లింక్ చూసిన ఢిల్లీకి చెందిన నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ ప్రతినిథి.. ఆ వీడియోలను కొంటానంటూ సొహైల్ కు మెసేజ్ చేశాడు.
దీంతో రూ.500కు సొహైల్ అతనికి విక్రయించాడు. దీనిపై సదరు వ్యక్తి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసును సైబర్ క్రైమ్ స్టేషన్ కు బదిలీ చేయడంతో విజయవాడలో సోహైల్ ను అదుపులోకి తీసుకున్నారు. చైల్డ్ పోర్న్ చూసినా, షేర్ చేసినా తప్పేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. యువత ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఏపీలో ఇటీవల ఇలాంటి కేసులు తరచూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరాలుగా గుర్తింపు పొందిన తిరుపతి, విజయవాడల్లో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. వెంటనే ఈ రెండు నగరాలపై ఫోకస్ చేశారు. ఇప్పటికే రంగంలోకి దిగి సోదాలు చేపట్టిన అధికారులు.. తిరుపతిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇక దేశ వ్యాప్తంగా సీబీఐ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సుమారు 14కు పైగా రాష్ట్రాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి 23 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో చైల్డ్ పోర్న్ వీడియోలను.. ఇతరులకు సర్క్యలేట్ చేస్తున్న సుమారు వందమంది అనుమానితులపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.