Home /News /andhra-pradesh /

VIJAYAWADA YOUNG GIRL COMMITTED SUICIDE AFTER BANK LOAN RECOVERY AGENTS HARASSED FOR REPAYMENT IN NTR DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Vijayawada: అప్పు కట్టలేకపోయిన నాన్న.. కుమార్తె షాకింగ్ నిర్ణయం.. రికవరీ ఏజెంట్ల దాష్టికానికి ఇదే రుజువు..

హరిత (ఫైల్)

హరిత (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బ్యాంక్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమిరిపోతున్నాయి. రికవరీ ఏజెంట్లు చూపే కర్కశానికి మరొక యువతి బలైంది. గతకొన్ని రోజుల క్రితం రికవరీ ఏజెంట్ల బారినపడి ఒక వివాహిత ఆత్మహత్యాయత్నం.. ఓ యువకుడి ఆత్మహత్య ఘటనలు మరచిపోక ముందే మరో యువతి ఏజెంట్ల దాష్టికానికి బలైంది.

ఇంకా చదవండి ...
    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో బ్యాంక్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమిరిపోతున్నాయి. రికవరీ ఏజెంట్లు చూపే కర్కశానికి మరొక యువతి బలైంది. గతకొన్ని రోజుల క్రితం రికవరీ ఏజెంట్ల బారినపడి ఒక వివాహిత ఆత్మహత్యాయత్నం.. ఓ యువకుడి ఆత్మహత్య ఘటనలు మరచిపోక ముందే మరో యువతి ఏజెంట్ల దాష్టికానికి బలైంది. ఉమ్మడి కృష్ణా జిల్లా (Krishna District) నందిగామలో విద్యార్థిని సూసైడ్ కలకలం రేపింది. హరిత అనే విద్యార్థినికి ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ తనను తల్లిదండ్రులు చదివించరనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కూతరు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని..కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.

    ఆత్మహత్యకు చేసుకోవడానికి ముందు హరిత రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది.ఆమె రాసిన సూసైడ్ లేఖ కూడా అందర్నీ కలచివేస్తోంది. ఆ లేఖలో ఏముంటే..? "అమ్మా ఇప్పుడున్న పరిస్థితులలో మనం బతకడం కూడా చాలా కష్టంగా ఉంది. మరోవైపు నాకు, చెల్లికి చదువు కోసం ఫీజ్ కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవు అన్నవిషయం నాకు తెలుసు.నాన్న తీసుకున్న లోన్ చెల్లించక పోవటం తో రికవరీ ఏజెంట్ల వత్తిడి ఎక్కువైనదని నాకు తెలుసు . వారు పెడుతున్న వత్తిడిని వారు అనుసరిస్తున్న విధానం తో మీరు ఎంత బాధపడుతున్నారో తనకు తెలుసని వారి తనకి చదువుకునేందుకు మల్లి అప్పు చేయొద్దని అందుకనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా" అంటు హరిత ఆ సూసైడ్ లేఖలో పేర్కొంది.

    ఇది చదవండి: అంత్యక్రియలు చేసిన 41 రోజుల తర్వాత ప్రత్యక్షం.. ఫ్యామిలీ ఫ్యూజులు ఔట్..


    హరిత తండ్రి తీసుకున్న బ్యాంక్ లో అప్పు (Bank Loan) తీర్చాలని ఇంటికొచ్చి బ్యాంక్ రికవరీ ఏజెంట్లు బెదిరించారని.., అంతేకాదు డబ్బులు కట్టకపోతే కూతుళ్ళని గేదెలు కాయించాలని ఏజెంట్లు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడని ఆమె ఆరోపిస్తోంది. తాజాగా హరిత సూసైడ్ విషయం తెలియగానే.. ఏజెంట్ల పరారీ అయ్యారు. వారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. నందిగామ పరిసర ప్రాంతాల్లో రికవరీ ఏజెంట్ల వేధింపులు తారస్థాయికి చేరాయి. పర్సనల్ లోన్, బైక్ ఫైనాన్స్, ఇల్లు ఫైనాన్స్, ఇతర ఫైనాన్స్ తీసుకున్న వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వేధింపులకు గురిచేస్తున్న రికవరీ ఏజెంట్లు అదే విధంగా వీక్లీ ఫైనాన్స్ వ్యాపారస్తులు కూడా ఇంటింటికి తిరిగి వడ్డీలకు డబ్బులు ఇచ్చి తర్వాత అధిక వడ్డీ వసూలు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు.దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Vijayawada

    తదుపరి వార్తలు