K Pawan Kumar, News18, Vijayawada
ఎక్కడైనా అధికార పార్టీదే ఆధిపత్యం ఉండాలి. కాదని వేరే వాళ్ల మాట నెగ్గిందో అక్కడ సీన్ సితార్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఇలాగే ఉంది. ముఖ్యంగా విజయవాడ (Vijayawada) లో అధికార పార్టీ డామినేషన్ తారాస్థాయికి చెరుతోంది. గుణదలలో వైసీపీ (YSRCP) నేతలు ఇష్టానుసారంగా గుండాగిరి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా మాట వినకపోతే దౌర్జన్యంగా షాప్ లను కుల్చివేస్తున్నారు. పోలీసులుకు ఫిర్యాదు చేసిన ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ జ్యూస్ షాప్ పై అధికార పార్టీ నేతలు ప్రతాపం చూపించారు. అదే ప్రాంతంలో ఉంటున్న వైసీపీ అనుచరులు కొద్దికాలంగా ఆ జ్యూస్ షాప్ యజమానిని బెదిరింపులకు గురి చేస్తుండడటంతో ఆ జ్యూస్ షాప్ యజమాని ఏమవుతుందో అని భయ బ్రాంతులకు భయంతో వణికిపోతున్నాడు.
గంగిరెద్దుల దిబ్బ సెంటర్లో ఉన్న తన జ్యూస్ షాప్ ని తొలగించాలని ప్రతి రోజు వేధింపులకు గురి చేస్తున్నారని, అక్కడ నుండి షాప్ తీసేసి మరొక షాప్ చూసుకునే వరకు కాస్త టైం ఇవ్వమని అడుగుతున్న వినిపించుకోకుండా సహించేది లేదని వైసిపి నాయకులు బెదిరిస్తున్నారనిషాప్ యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
గత శుక్రవారం జ్యూస్ షాప్ కితాళాలు వేసి ఉండగా అతని షాప్ తాళాలని పగలగొట్టి దౌర్జన్యంగా ఆషాప్ లో ఉన్నటువంటి తన సామగ్రి ఏవైతో ఉన్నాయో ఫ్రిజ్, కూలర్, జ్యూస్ సామగ్రిని పూలు కాయలను, గ్యాస్ బండలను, వెల్డింగ్ మిషన్ మొత్తాన్ని అపహరించుకు పోయారని నాకు అన్నం పెట్టే నా జీవనోపాదిని నాశనం చేసారని వాపోయారు. వైసీపీ నాయకులకు అనుకూలంగా నడుచుకోవాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆ షాప్ యజమాని భయబ్రాంతులకు గురవుతున్నాడు.
తన షాపుని బలవంతంగా తొలగించేందుకుకారకులైన వారు, సామగ్రినిఅపహరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఆ కేసుని పట్టించుకోడం లేదని... అసలు తనకు రక్షనే కల్పించడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.వైసీపీ వారుఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇంతగా రెచ్చి పోతున్న పోలీసులు ఏమి పట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఆ బాధితుడు కడుపు నింపే అతని జీవనోపాధిని తొలగించాల్సిన అవసరం ఏముందని, వారికి నచినట్లుగా చేయకుంటే ప్రాణాలను సైతం తీసేస్తామని బెదిరిస్తూ, షాప్ లోని సామగ్రి అంతగా అపహరించినట్లు కళ్ళకు కట్టినట్లు కనిపించిన ఎందుకు చర్యలు తీసుకోడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన షాపును ఎందుకు తొలగించమంటున్నారో దానికి కారణాలు ఏంటో అసలు దీని వెనుక ఎవరున్నారో తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి వారంతా కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada, Ysrcp