K Pawan Kumar, News18, Vijayawada
గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకి శృతి మించి పోతున్నాయి. గంజాయి తీసుకుని మహిళలుపై వీరంగం చేస్తూ మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. గుంటూరు జిల్లా (Guntur District) తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో అలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఆడపిల్లలకు ఎటువంటి అన్యాయం జరిగినా వెంటనే స్పందిస్తాం అని చెప్తారు. దిశ యాప్, 100 డయల్ ఆడపిల్లలు ఆపదలో ఉన్నవారు ఆ నంబర్స్ కి కాల్ చేయమని వెంటనే రక్షిస్తామని చెప్తారు. తీరా ఆడపిల్ల ఆపదలో ఉండి 100 కి ఫోన్ చేసినా స్పందించరు. అంతేకాదు ఆ పరిధిలో ఉన్న పోలీసులుకి ఫోన్ చేసినా ఏమాత్రం పట్టించుకోరు. అలాంటి సంఘటనే ఉండవల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
తెల్లవారుజామున తమ పనుల నిమిత్తం పూలతోటలకు వెళ్లే మహిళలు ఎంతోమంది ఉన్నారు. మహిళలు వారి వారి పొలాలకు వెళ్లే సరికి వారి పొలాల్లో గంజాయి మత్తులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడ తిరుగుతున్నారు. ఎవరు మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని మహిళలు నిలదీయటంతో.. వారిని మహిళలను అనే గౌరవం కాడా లేకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ భయబ్రాంతులకు గురి చేశారు. వెంటనే భయంతో వారి కుటుంబ సభ్యులుకు జరిగినది చెప్పగా వారు వెంటనే 100 కు డయల్ చేసిసమాచారం ఇచ్చారు.దీంతో పోలీసులు మేము మీ పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లి స్టేషన్ కి మేము సమాచారం అందిస్తాము. మీరు మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వండని తెలిపారు. తాడేపల్లి ల్యాండ్ లైన్ నెంబర్ ఇవ్వగా వారి కుటుంబ సభ్యులు వెంటనే ఆ ల్యాండ్ లైన్ కు డయల్ చేయగా ఎవరు స్పందించలేదు.
అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది. మహిళలకు పోలీసులు ఎంత రక్షణ ఇస్తున్నారు అనేది. మహిళలకి అండగా మేము ఉన్నాము అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు. ఇదిగో ఇలా ప్రాణాల మీదకి వచ్చేసరికి ఏమి పట్టనట్టు వ్యవహరిస్తూ ఉంటారు.అంటే సినిమాలో చూపించిన మాదిరిగా అంత అయిపోయాక పోలీసులు వచ్చి హడావుడి చేస్తారు అనేది పూర్తిగా అర్థం అవుతుంది. ఆపదలో ఉన్న మహిళలు అన్నిసార్లు ఫోన్ లు చేసిన ఎటువంటి స్పందన లభించలేదు అంటే అర్థం.. ఎందుకు అంత నిర్లక్ష్య ధోరణి..?
ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతంలోనే నిఘావారు నిఘా పెట్టకపోవడానికి కారణం! కేవలం ముఖ్యమంత్రికే మాత్రేమేనే భద్రతమహిళలుకి భద్రత లేదా? ఇలాంటివి గుర్తించి మరల పునరావృతం కాకుండా చేయాల్సిన స్పెషల్ బ్రాంచ్ ఏమి చేస్తున్నట్లు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వీరి నిర్లక్ష్యాన్ని గంజాయి బాచ్ అదునుగా తీసుకుని వారికి నచ్చినట్లు వ్యవహరిస్తూ మహిళలపై వీరంగం చేస్తున్నారు. మహిళలకు ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి ... ఏదైనా జరిగాకే స్పందిస్తారా అంటు ప్రశ్నిస్తున్నారు.
ఆడపిల్ల ఆపదలో ఉండగా కాల్ చేస్తే స్పందించరా ఇదేంటి అని ప్రశ్నిస్తే అసలు 100 కు కాల్స్ రాలేదని.. ఆ పరిధిలో ఉన్న ల్యాండ్ లైన్ వైర్ సరి లేదని కబుర్లు చెప్పుకొస్తున్నారు. తీరా డయల్ చేసిన లిస్ట్ పెట్టగానే ఏ మాత్రం నోరు మెదపడం లేదు. ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న చుట్టుపక్కల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేసారో అర్థం అవుతుంది. ఇప్పటికి అయిన స్పందించి స్థానికులకు ఎటువంటి హాని జరగక ముందే నిఘా ఏర్పాటు చేస్తారా లేకా.. ఏదైనా జరిగే వరకు ప్రేక్షకుల వలే వేచి చూస్తారనేది... చూడాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Tadepalli, Vijayawada