Home /News /andhra-pradesh /

VIJAYAWADA WOMAN CONSTABLE DIED WITH BLOOD CANCER TWO DAYS BEFORE MARRIAGE ENGAGEMENT IN KRISHNA DISTRICT FULL DETAILS HERE PRN

Sad Story: రెండు రోజుల్లో నిశ్చితార్థం.. మహిళా కానిస్టేబుల్ విషాదాంతం... ఇది ఊహకందని విషాదం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Krishna District: ఆ యువతి ఎంతో కష్టపడి చదివింది. అందుకు తగ్గట్లుగానే కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించింది. కుమార్తె ప్రయోజకురాలు కావడంతో తల్లిదండ్రులు కూడా సంతోషించారు. ఆమెకు పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరుపోతుందని భావించారు. అనుకున్నట్లుగానే మంచి సంబంధం కుదిరింది. కానీ ఆ యువతి జీవితం అనూహ్య మలుపు తిరిగింది.

ఇంకా చదవండి ...
    ఆ యువతి ఎంతో కష్టపడి చదివింది. అందుకు తగ్గట్లుగానే కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించింది. కుమార్తె ప్రయోజకురాలు కావడంతో తల్లిదండ్రులు కూడా సంతోషించారు. ఆమెకు పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరుపోతుందని భావించారు. అనుకున్నట్లుగానే ఓ యువకుడితో పెళ్లి కుదిర్చారు. అన్ని లాంఛనాలు మాట్లాడుకున్నారు. ఆ యువతి కూడా కొత్త జీవితంపై ఎన్నో కలలుకంది. అందమైన జీవితాన్ని ఊహించుకుంది. కానీ అమె ఒకటి తలిస్తే... దేవుడు మరొకటి తలిచాడు. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణాజిల్లా (Krishna District, ఉంగుటూరు మండలం, నందమూరుకు చెందిన పరసా రమ.. విజయవాడ (Vijayawada) అజిత్ సింగ్ నగర్ పోలిస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఇటీవలే తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధం కుదిర్చారు.

    మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకున్నారు. ఈలోగా రమకు జ్వరం వచ్చింది. తీవ్రజ్వరం రావడంతో బ్లడ్ టెస్ట్ చేయించగా ప్లేట్ లెట్స్ పడిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అందుకు ట్రీట్ మెంట్ ఇస్తూనే సందేహం రావడంతో మరిన్ని టెస్టులు చేయించారు. ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. విషయం తెలిసిన మూడు రోజులకే రమ మృతి చెందింది. రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉండటంతో కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈలోగానే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. పెళ్లి జరగాల్సిన కుమార్తెను కాటికి సాగనంపాల్సిన రావడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విధి నిర్వహణలో ఎంతో చురుగ్గా ఉండే రమ్య చనిపోవడంతో అటు పోలీసు అధికారులు కూడా విషాదంలో మునిగిపోయారు.

    ఇది చదవండి: ఆ పాడుపని చేయవద్దన్నా వినని భార్య.. విసిగిపోయిన భర్త ఏం చేశాడంటే..!


    ఇటీవల గుంటూరు జిల్లా (Guntur District) పెదకూరపాడు మండలం లింగుంట్లలో గుడిబజారుకు చెందిన రావెల శివయ్య, వెంకాయమ్మల కుమారుడు నాగచైతన్య గ్రామ వాలంటీర్ గా పనిచేస్తుననాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు నరసరావుపేటకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 14న పెళ్లి జరిపించాలని ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఐతే పెళ్లికి ఒక రోజు ముందు నాగచైతన్య తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. ఐతే పెళ్లి పనుల్లో పడి జ్వరాన్ని నిర్లక్ష్యం చేశాడు.

    ఇది చదవండి: ప్రియుడి కోసం యువకుడి ఆందోళన... దుబాయ్ లో తెలుగు యువకుల పెళ్లి... ఏపీలో రచ్చ రచ్చ...!



    జ్వరం కాస్తా డెంగీ, కామెర్లకు దారితీయడంతో పరిస్థితి విషమించి ఈనెల 16న మృతి చెందాడు. వారం క్రితమే చైతన్య తండ్రి శివయ్య, ఇతర కుటుంబ సభ్యులు జ్వరం బారిన పడి ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఈలోగా కుమారుడు జ్వరంతో మృతి చెందడంతో విషాదంలో మునిగిపోయారు. మరోవైపు పెళ్లికి ముందు కాబోయే భర్త ప్రాణాలు కోల్పోవడంతో వధువు కన్నీరుమున్నీరవుతోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు