Anna Raghu, News18, Amaravati
ఆమె తల్లిదండ్రులు చూసిన అబ్బాయితో తాళికట్టించుకుంది. భర్తతో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకొని అత్తారింట్లో అడుగుపెట్టింది. కానీ ఫస్ట్ నైట్ రోజే ఆమెకు షాక్ తగిలినంతపనైంది. అప్పటి నుంచే భర్త దూరం పెట్టడం మొదలుపెట్టాడు. పెళ్లైన కొత్తలో ఇబ్బంది పడుతున్నాడేమో అనుకుంది. కానీ రానురాను ఆమెకు షాకింగ్ నిజాలు తెలిశాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఎన్టీఆర్ జిల్లా (NTR District) నందిగామకు చెందిన కొంగర నవ్యతకు నాలుగేళ్ల క్రితం కొంగర నరేంద్రనాథ్ కు పెళ్లైంది. పెళ్లి సమయంలో భారీగానే కట్నకానుకలు సమర్పించుకున్నారు. ఐతే పెళ్లైనప్పటి నుంచి నరేంద్ర.. నవ్యతను వేధిస్తున్నాడు. దగ్గరకెళ్లేందుకు యత్నించినా దూరంగా వెళ్లిపోయేవాడు. అదేంటని ప్రశ్నిస్తే అదనపు కట్నం కోసం వేధిస్తుండటం, శారీరకంగా మానసికంగా హింసించడం చేసేవాడు. భర్తకు అత్తమామలు, ఆడపడుచు కూడా తోడవడటంతో నవ్యత కష్టాలు రెట్టింపయ్యాయి.
దీంతో చేసేది లేక న్యాయం కోసం కృష్ణా నదిలో ఆందోళనకు దిగింది. తన భర్త, అత్తమామలు వేధిస్తున్నారని.. భర్త సంసారానికి పనికిరాడని.. తాను దగ్గరకు వెళ్లినా దూరం పెడుతున్నాడని ఆరోపించింది. సంసారం కోసం మాట్లాడుతుందే అదనపు కట్నం తేవాలంటూ వేదిస్తూ అసలు విషయాన్ని పక్కదోవపట్టిస్తున్నట్లు తెలిపింది. భర్త గురించి అత్తమామలతో చెప్పినా అలాంటిదేమీ లేదని వాదిస్తున్నారని వాపోయింది.
అత్తమామలు, తల్లిదండ్రులు కూర్చోబెట్టిన మాట్లాడినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదని నవ్యత ఆరోపించింది. అత్త మామలు ఆడపడుచును జెర్మనీ నుండి పిలిపించి మాట్లాడారని.. ఆమె వచ్చిన తర్వాత బలవంతంగా తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించింది. దీంతో న్యాయం కోసం కృష్ణానదిలో ఆందోళనకు దిగినట్లు నవ్యత వివరిచింది. ఐతే మెట్టినింటి ముందు ఆందోళన చేస్తే పోలీసులతో అరెస్ట్ చేయిస్తారన్న భయంతోనే కృష్ణానదిలో నిరసనకు దిగినట్లు ఆమె తెలిపింది.
ఇది చదవండి: ప్రాణం తీసిన శోభనం.. ఫస్ట్ నైట్ భయంతో యువకుడు ఏం చేశాడంటే..!
ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా (Guntur District) లో జరిగింది. యర్రబాలెంగ్రామానికి చెందిన శ్రీమాన్.. విశాఖపట్నంకు చెందిన అనూష.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న సమయంలో ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇంట్లో వాళ్లను ఎదురించి అనూషను పెళ్లి చేసుకున్న శ్రీమాన్.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మరో మహిళతో ఎఫైర్ పెట్టుకొని యర్రబాలెం వచ్చేశాడు. అంతకుముందే అనూష ఉద్యాగాన్ని గ్యారెంటీగా పెట్టి రూ.50లక్షలు లోన్ తీసుకున్నాడు. దీంతో చేసేది లేక భర్త కోసం అత్తింటి వద్ద ఆందోళనకు దిగింది. కేసులో హైదరాబాద్ పోలీసులు నోటీసులిచ్చేందుకు యత్నించగా శ్రీమాన్ తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో అనూష ఆందోళన విరమించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Vijayawada, Wife and husband