Home /News /andhra-pradesh /

VIJAYAWADA WIFE KILLED HUSBAND IN KRISHNA DISTRICT ABH NJ VPR

vijayawada: అనుమానిస్తున్నాడని భర్తను పచ్చడిరాయితో కొట్టిన భార్య..! తీవ్రరక్తస్రావమై భర్త మృతి..!

అనుమానిస్తున్నాడని భర్తను పచ్చడిరాయితో కొట్టిన భార్య..!

అనుమానిస్తున్నాడని భర్తను పచ్చడిరాయితో కొట్టిన భార్య..!

అనుమానిస్తున్నాడని భర్తను హత్య మార్చిన భార్య.. బాబాయ్‌లే కర్కస్కులుగా మారారు. వావివరసలు మర్చిపోయి మృగాళ్లలా ప్రవర్తించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో జైలుశిక్ష. ఉమ్మడి కృష్ణాజిల్లా క్రైమ్ వార్తల రౌండప్ ఒకసారి చూద్దాం.

  (Prayaga Raghavendra Kiran, News 18, Vijayawada)

  అనుమానిస్తున్నాడని భర్తను హత్య మార్చిన భార్య.. బాబాయ్‌లే కర్కస్కులుగా మారారు… వంటి ఘటలు కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లా క్రైమ్ వార్తల రౌండప్ ఒకసారి చూద్దాం.

  అనుమానిస్తున్నాడని భర్తను హతమార్చిన భార్య..!

  తనను అనుమానిస్తున్నాడని భర్తను భార్య హతమార్చిన ఘటన చల్లపల్లి మండలం ఆముదార్లంకలో చోటుచేసుకుంది. కల్లేపల్లి వెంకట సుబ్బారావు(31), వీరకుమారి దంపతులు. వెల్డింగ్ పనుల నిమిత్తం అతను వేరే ప్రాంతాలకు వెళ్లి వస్తుంటాడు. భార్య ఎవరితో మాట్లాడిన అనుమానిస్తూ… ప్రవర్తన మార్చుకోవాలని పదేపదే మందలిస్తుంటాడు. గురువారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన సుబ్బారావు భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భర్తపై వీరకుమారి పచ్చడి రాయితో దాడి చేసింది. తలపై గాయమైనప్పటికీ వెంకటసుబ్బారావు మరోమారు మద్యం తాగి వచ్చి నిద్రపోయాడు. మద్యం మత్తులో ఏమి తెలియలేదు.. కానీ తలలో తీవ్ర రక్తస్రావం అయి శుక్రవారం తెల్లారిజామున మృతి చెందాడు. మృతుడి తల్లి నిర్మల పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వీరకుమారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  వావివరసలు మరచి..!

  ఈ రోజుల్లో మానవ మృగాళ్లు మన ఇళ్లలోనే ఉంటున్నారు. ఇటీవల  ముక్కుపచ్చలారని చిన్నారులపై బాబాయిలే లైంగిక దాడులకు పాల్పడిన ఘటనలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో చోటుచేసుకున్నాయి. తండ్రి తర్వాత తండ్రి అంతటి వారే చిన్నారులపై లైంగిక దాడులకు ఒడిగట్టారు. మానవసంబంధాలపై రోజురోజుకు నమ్మకం తగ్గుతోందనడానికి… పశ్చిమ కృష్ణలో జరిగిన ఈ రెండు ఘటనలే తార్కానం. ఓ చోట సవితి తండ్రి అఘాయిత్యానికి పాల్పడితే మరోచోట.. వరసకు బాబాయి అయిన బాలికపై.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

  చందర్లపాడు మండలం కోనయ్యపాలెంలో ఓ వివాహితకు ఇద్దరు కుమార్తెలు. ఆమె భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించడంతో.. కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన బత్తిన కొండలను రెండవ వివాహం చేసుకుంది. ఆమె కుమార్తెలిద్దరు కోనయ్యపాలెంలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. దంపతులిద్దరూ పామర్రు సమీపంలో అని వేల్పుల గ్రామానికి కూలి పనులకు వెళ్తుంటారు.

  ఈ నెల 27న భర్త కొండలు తన భార్యకు చెప్పకుండా కోనయ్యపాలెంకు వెళ్లాడు.
  అక్కడ పెద్ద కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్న కుమార్తె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికి కొండలు పరారయ్యాడు. గతంలో కూడా అతడు బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడని ఆ బాలిక చెబుతోంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కొండలపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు.

  తిరువూరు మండలం ఆంజనేయ పురంలో ఇడుపులపాటి దాసు(32) మద్యం మత్తులో వరుసకు కూతురైన నాలుగేళ్ల బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని బాలిక తెలిపింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు దాసును తీవ్రంగా కొట్టారు…ఈ ఘటనలో గాయపడిన దాసు అక్కడికక్కడే మరణించాడు.

  డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జైలు శిక్ష..!
  భవానిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 32 మందికి జైలు శిక్ష పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిని ఏడో అదనపు ఎం ఎం కోర్టు న్యాయమూర్తి కే సురేష్ బాబు ముందు శుక్రవారం హాజరుపరిచారు. వారిలో ఒకరికి 40 రోజులు మరొకరికి 30 రోజులు జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. కొందరికి ఐదు నుంచి 25 రోజులు వరకు జైలు శిక్ష, పదివేల రూపాయల చొప్పున జరిమానా విధించారు.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Andhrapradesh, Crime news, Local News, Vijayawada

  తదుపరి వార్తలు