Andhra Pradesh: 80 ఏళ్ల వయసులో భార్యభర్తల మధ్య గొడవ... ఎవరూ తగ్గలేదు... చివరికి ఏం జరిగిందంటే..!

ప్రతీకాత్మకచిత్రం

వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. దశాబ్దాలుగా కలిసి మెలిసి ఉంటున్నారు. పిల్లలు, వారి పిల్లలు కూడా సెటిల్ అవడంతో హాయిగా శేషజీవితం గడువుతున్నారు. కానీ ఈ వయసులోనూ…

 • Share this:
  వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. దశాబ్దాలుగా కలిసి మెలిసి ఉంటున్నారు. పిల్లలు, వారి పిల్లలు కూడా సెటిల్ అవడంతో హాయిగా శేషజీవితం గడువుతున్నారు. కానీ ఈ వయసులోనూ వాళ్లిద్దరి మధ్య గొడువలు, మనస్పర్దలు వచ్చాయి. బంధువుల ఇంటికి వెళ్లే విషయంలో యువజంట మాదిరిగా ఆ వృద్ధజంట మాటా మాటా అనుకున్నారు. ఆ తర్వాత ఏకంగా కొట్టుకునేవరకు వెళ్లారు. ఫలితంగా వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం, కోళ్లపర్రు గ్రామనికి చెందిన కనుమూరి విజయరామరాజు ఆయన భార్య సరళాదేవి రెండేళ్లుగా గొల్లలకోడేరులోని సంజన్ ఆపార్ట్ మెంట్స్ లో నివాసముంటున్నారు. విజయరామరాజు మొదటిభార్య చనిపోవడంతో 20 ఏళ్ల క్రితం తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన సరళాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు కూడా ఇది రెండో వివాహం. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

  ముఖ్యంగా భార్య సరళాదేవి ఆమె బంధువుల ఇంటికి వెళ్లడం నచ్చని విజయరామరాజు ఇదే విషయంపై తరచూ ఆమెతో గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఇద్దరూ ఒకర్ని ఒకరు దూషించుకున్నారు. అక్కడితో ఆగలేదు. ఆగ్రహంతో మసాలా దినుశులు నూరుకునే కలంపత్రంపై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సరళాదేవి తీవ్రంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన విజయరామరాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సరళా దేవి.. ఫ్లాట్ తరుపు తీసే ఓపిక లేకపోవడంతో తన దగ్గరున్న సెల్ ఫోన్ తో విజయరామరాజు మొదటిభార్య కుమారుడు వెంకటరామరాజుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది.

  ఇది చదవండి: సహజీవనం చేస్తున్న వ్యక్తే తండ్రి అని కూతుర్ని నమ్మించిన తల్లి.. కానీ అతడు మాత్రం ఆమెను అలా చూడలేదు


  వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి సరళాదేవిని భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంకటరామరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. విజయరామరాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ప్రస్తుతం సరళాదేవి ఆస్పత్రిలో ఉండగా ఆమె కోలుకున్న తర్వాత అసలేం జరిగిందనేది తెలియదని పోలీసులు చెబుతున్నారు. కాటికి కాళ్లు చాచిన వయసలోనూ వృద్ధదంపతులు ఏమీ తెలియని వాళ్లలా గొడవపడటం, ఒకరిపై ఒకరు దాడి చేసుకొని చావు వరకు వెళ్లడం వారి కుటుంబ సభ్యులను కలచివేస్తోంది. హాయిగా కృష్ణారామా అంటూ కాలం వెళ్లదీయాల్సిన సమయంలో ఒకరిపై ఒకరు పంతాలకు పోయి ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్ల చుట్టూతిరగాల్సి వచ్చింది. కాబట్టి వయసు ఏదైనా భార్యాభర్తలు గొడవ పడుతూనే ఉంటారనేదానికి ఇదే నిదర్శనం.

  ఇది చదవండి: ఫేస్ బుక్ లో లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిన యువతి... ఆ తర్వాత అతడు ఏం చేశాడంటే...


  Published by:Purna Chandra
  First published: