Home /News /andhra-pradesh /

VIJAYAWADA WIFE KILLED A WOMAN FOR HAVING EXTRA MARITAL AFFAIR IN VIJAYAWADA ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Affair: నా భర్తను వదిలేయ్.. ఎఫైర్ పెట్టుకున్న మహిళకు భార్య వార్నింగ్.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో జరుగుతున్న నేరాల్లో చాలా వరకు అక్రమ సంబంధాలతోనే ముడిపడుతున్నాయి. పెళ్లిని అపహాస్యం చేస్తూ కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాలు (Extramarital affair) చివరికి ప్రాణనష్టానికి దారితీసింది.

    ఈ రోజుల్లో జరుగుతున్న నేరాల్లో చాలా వరకు అక్రమ సంబంధాలతోనే ముడిపడుతున్నాయి. పెళ్లిని అపహాస్యం చేస్తూ కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాలు (Extramarital affair) చివరికి ప్రాణనష్టానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ (Vijayawada) కృష్ణలంకలోని రాణిగారితోట ప్రాంతానికి చెందిన రౌతు సత్య.. భర్త, కుమార్తెతో కలిసి నివశిస్తోంది. సత్య విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వీపర్ గా పనిచేస్తోంది. ఆమె కుమార్తె ఎనిమిదో తరగతి చదువుతూనే అప్పుడప్పుడు క్యాటరింగ్ పనులకు వెళ్తుండేది. వ్యసనాలకు బానిసైన సత్య భర్త.. డబ్బుల కోసం అప్పుడప్పుడు భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ ఏడాది క్రితం అదే ప్రాంతానికి చెందిన ఆదినారాయణతో సత్యకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం సత్య భర్తకు తెలయడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

    ఇదిలా ఉంటే ఈ ఎఫైర్ విషయం ఆదినారాయణ భార్యకు తెలియడంతో తరచూ సత్యతో గొవపడుతుండేదు. ఇదిలా ఉంటే సత్య తీరు నచ్చక 20 రోజుల క్రితం సత్య భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. భర్త వెళ్లిపోయిన వెంటనే ఆదినారాయణ.. సత్యతో ఇల్లు ఖాళీ చేయించి తన ఇంటి సమీపంలోని మరో ఇంట్లో ఉంచాడు. అప్పటి నుంచి ఆదినారాయణ నిత్యం సత్య ఇంటికి వస్తుండేవాడు. ఐతే వీరి సహజీవనాన్ని తట్టుకోలేని ఆదినారాయణ భార్య.. ఓరోజు సత్య ఇంటికెళ్లి గొడవ పడింది. చంపేస్తానని బెదిరించింది.

    ఇది చదవండి: అమ్మో ఈమె మామూలు మహిళ కాదు.. ఒకేసారి ముగ్గురితో ఎఫైర్.. అందులో ఒకడ్ని దారుణంగా..



    ఈ క్రమంలో గురువారం రాత్రి సత్య ఇంటికి వెళ్లిన మల్లేశ్వరి ఆమెతో ఘర్షణ పడి తనతో తెచ్చుకున్న బ్రేడుతో సత్య గొంతుకోసింది. అనంతరం రోకలి బండతో తలపై మోది హత్య చేసింది. ఆ తర్వాత ఇంటికి తలుపువేసి వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన సత్య కుమార్తె.. తల్లి మృతదేహాన్ని చూసి భయంతో చుట్టుకపక్కలవారికి చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేశారు.

    ఇది చదవండి: పెళ్లై 9ఏళ్లైనా ప్రియుడ్ని వదలని భార్య.. భర్త నచ్చజెప్పినా వినలేదు.. చివరకి..


    చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అందులో మల్లీశ్వరి సంచితో వెళ్తుండటాన్ని గుర్తించారు. డాగ్ స్క్వాడ్ ను తీసుకురాగా అవి మల్లేశ్వరి ఇంటి దగ్గరకు వెళ్లి ఆగాయి. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించింది.

    ఇది చదవండి: ఒకేసారి ఇద్దరితో మహిళ ఎఫైర్... ఓ రోజు ఆ ఇద్దరూ ఎదురుపడ్డారు.. తర్వాత ఏం జరిగిందంటే..!


    తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నందుకే సత్యను హత్య చేశానని చెప్పింది. హత్య కోసం ఉపయోగించిన బ్లేడును, మరో కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐతే హత్య జరిగిన ప్రదేశంలో మద్యం సీసా, కాల్చిన సిగరెట్లు ఉండటంతో దీని వెనుక మరొకరి పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Extramarital affairs, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు