Anna Raghu, Guntur, News18
పెళ్లైన తర్వాత పిల్లలు కలగాలని ప్రతి ఒక్కరూ కలలుగంటారు. బుడిబుడి అడుగులు వేస్తూ పసివాళ్లు ఇంట్లో తిరుగుతుంటే తల్లిదండ్రులు చూసి మురిసిపోతుంటారు. వారికి చిన్న దెబ్బ తగిలినా విలవిల్లాడిపోతారు. వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు కష్టపడుతుంటారు. కానీ ఓ సైకో మాత్రం మూఢనమ్మకాలను తలకెక్కించుకున్నాడు. లంకె బిందెల కోసం నరబలి ఇచ్చేందుకు పిల్లల్ని కనాలని ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను చిత్రహింసలు పెట్టాడు. వేధింపులు భరించలేని భార్య తనను రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విజయవాడకు(Vijayawada) చెందిన జ్యోత్స్న ఎంబీఏ చదువుకుంది. బెంగళూరులో (Bengalore) ఉద్యోగం చేస్తున్న సమయంలో కోకంటి సుశాంత్ చౌదరి అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ప్రేమించకపోతే చనిపోతానని బెదిరించడంతో అతడి ప్రేమను అంగీకరించింది. కొన్నాళ్ల తర్వాత నెల్లూరు (Nellore)లో తమ బంధువుల ఇంటికి తీసుకొచ్చి జొన్నవాడ కామాక్షి దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. నెల్లూరులోని రిజిస్టర్ ఆఫీసులో పెళ్లిని రిజస్టర్ కూడా చేసుకున్నారు.
కూతురి ప్రేమ పెళ్లిని అంగీకరించిన జోత్స్న తల్లిదండ్రులు విజయవాడలో ఘనంగా రిసెప్షన్ జరిపించారు. ఆ తర్వాత జోత్స్న తల్లిదండ్రుల నుంచి నాలుగు లక్షల నగదు, వంద గ్రాముల బంగారాన్ని కట్నంగా తీసుకున్నాడు. పెళ్లైన తర్వాత కొన్నాళ్లు బెంగళూరులో కాపురం పెట్టిన సుశాంత్.. ఆ తర్వాత నెల్లూరుకు మకాం మార్చారు. అప్పటి నుంచే జోత్స్నకు కష్టాలు మొదలయ్యాయి. భర్త, అత్త, ఆడబిడ్డలు ఆమెను చిత్రహింసలు పెట్టేవారు. ఇంట్లో లంకె బిందెలున్నాయంటూ ఖలీల్ బాయ్ అలియాస్ నవాబ్ అనే బాబాను తీసుకొచ్చి ఇంట్లో క్షుద్రపూజలు జరిపించేవారు.
ఇదేంటని నిలదీసిన జోత్స్నకు భర్త నుంచి విస్తపోయే సమాధానం వచ్చింది. నువ్వు త్వరగా పిల్లల్ని కనాలని.. వారిని బలిస్తే లంకె బిందెలు లభిస్తాయని ఆమెపై ఒత్తిడి చేయడం చేశాడు. ఇంట్లో ముగ్గులు వేసి మధ్యలో ఆమెను కూర్చోబెట్టి పూజలు చేసేవారు. పూజలు చేస్తున్న విషయం ఎవరికైనా చెబితే తల్లిదండ్రులు రక్తం కక్కుకోని చనిపోతారంటూ బెదిరించేవారు. పూజల వ్యవహారాన్ని నిత్యం జోత్స్న నిలదీయడంతో కాపురాన్ని మళ్లీ బెంగళూరుకు మార్చాడు. అక్కడ ఇద్దరు యువతులతో ఎఫైర్ నడిపిస్తూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు.
పిల్లల్ని కనకుంటే ఆ యువతులతో పిల్లల్ని కని తనకు కావాల్సిన పని జరిపించుకుంటానని హింసించేవాడు. విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వేధింపులు రెట్టింపయ్యాయి. భర్త ఆగడాలను భరించలేని జోత్స్న విజయవాడలోని తల్లిదండ్రుల దగ్గరకు చేరుకోని పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. జోత్స్న ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్మ ప్రేమపేరుతో వంచించడమే కాకుండా మూఢనమ్మకాలు, అమ్మాయిల మోజులో తనను హింసిస్తున్న భర్త, అత్త, ఆడపడుచుపై చర్యలు తీసుకోవాలని జోత్స్న పోలీసులను వేడుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Harassment, Vijayawada