Home /News /andhra-pradesh /

VIJAYAWADA VILLAGE STYLE RESTAURANT IS NOW THE FAVOURITE PLACE FOR VEGETARIANS IN VIJAYAWADA FULL DETAILS HERE PRN VPR NJ

Vijayawada: ఇప్పుడీ రెస్టారెంట్ అందరికీ ఫేవరెట్ స్పాట్.. ఇక్కడ స్పెషాలిటీ ఇదే..!

విజయవాడలో

విజయవాడలో విలేజ్ స్టైల్ దాబా

Vijayawada: రెస్టారెంట్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ముందుగా నాన వెజ్ ఐటమ్స్ అందులోను చికెన్, మటన్ తో చేసిన స్పెషల్‌ డిషెస్‌ను మహా ఇష్టంగా తింటుంటారు భోజన ప్రియులు. రుచి కరమైన విందు దొరికితే వారి ఆనందాలకు అవధులు ఉండవు. ఫుడ్‌ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు హోటల్లు, రెస్టారెంట్లు నయా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

  రెస్టారెంట్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ముందుగా నాన వెజ్ ఐటమ్స్ అందులోను చికెన్, మటన్ తో చేసిన స్పెషల్‌ డిషెస్‌ను మహా ఇష్టంగా తింటుంటారు భోజన ప్రియులు. రుచి కరమైన విందు దొరికితే వారి ఆనందాలకు అవధులు ఉండవు. ఫుడ్‌ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు హోటల్లు, రెస్టారెంట్లు నయా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. మనం చిన్నప్పుడు పల్లెటూర్లలో సాయంత్రం అయిందంటే
  చాలు.. అందరూ బయట కూర్చుని చందమామను చూస్తూ లొట్టలేసుకుంటూ తింటూ ఆత్మారాముడిని సంతృప్తి పరుస్తుంటారు. కానీ ఇప్పుడు బంగ్లాలొచ్చి నగరాలు పెరిగి చందమామ చూద్దామన్నా కనిపించడం లేదు. ఇంక ఆరుబయట కూర్చుని ఏం తింటాం. కానీ, మనం అనుభూతి చెందిన ఆ చిన్ననాటి జ్ఞాపకాలను నేటి తరం పిల్లలకు ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాంటి వారి కోసమే విజయవాడలోని వెజ్ దాబా రెస్టారెంట్‌.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని  విజయవాడ (Vijayawada) నగరంలోని వెబ్‌ దాబా రెస్టారెంట్‌ అతి కొద్దిరోజుల్లోనే జనాలకు చేరువయింది. ముఖ్యంగా శాఖాహారులకు ఇదో ఫేవరెట్ ప్లేస్‌గా మారిపోయింది. సాధారణంగా నాన్‌ వెజ్ రెస్టారెంట్లు అన్ని ప్రాంతాల్లో ఉంటాయ్ కానీ వెజిటేరియన్స్‌ కోసమే స్పెషల్‌గా రెస్టారెంట్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వారికోసమే ప్రత్యేకంగా వెజ్ ఐటమ్స్‌తో రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు సీతయ్య విలేజ్ దాబా నిర్వాహకులు రాము తెలిపారు.

  ఇది చదవండి: తెలుగోడి పంచ్‌ పవరే వేరప్పా..! బాక్సింగ్‌లో మిర్చిలాంటి కుర్రాడు..!


  ఈ హోటల్‌కు మరో ప్రత్యేకత ఏమిటంటే?
  శాఖాహారులు చాలా మంది బయట తినడానికి అంతగా ఆసక్తి చూపరు. అలాంటి వారికోసమే నగరంలో దాబా స్టైల్‌లో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. వెజ్ లో దొరికే బిర్యానీలు, స్టార్టర్లు, రోటి, బటర్ నాన్ , వెజ్ కర్రీస్‌తో పాటు ఫ్రూట్ సలాడ్‌, ఐస్ క్రీమ్స్ వంటి వంటకాలు ఈ దాబాలో లభిస్తాయి. కనీసం కోడిగుడ్డు ఈ హోటల్ దరిదాపుల్లో కూడా కనిపించదు. ఈ రెస్టారెంట్‌ ప్రత్యేకంగా వెజ్ లవర్స్ కోసమే. నగరవాసులే కాకుండా ఈ దాబాలో తినడానికి భోజనప్రియులు పలు దూరప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని దాబా స్టైల్ కూడా అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ కూర్చుని తింటుంటే మన పల్లెటూరిలో ఆరుబయట కూర్చుని తింటున్న ఫీలింగ్‌ తప్పకుండా వస్తుంది. చూట్టూ ఆ వింటేజ్‌ ఆంబియన్స్‌ భోజనప్రియులను ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకుంటుంది.

  ఇది చదవండి: బ్రేక్ ఫాస్ట్ లో బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా..? కోడి కూయకముందే పాయా రెడీ..


  సాయంత్రం అలా ఆరుబయట కూర్చుని తింటే..!

  ఇక్కడే దొరికే వెజ్ ఐటమ్స్ కోసం సుధర ప్రాంతాల నుంచి వస్తుంటారు . సాయంత్రం వేళలో ఆరు బయట చక్కని వాతవరణంలో పసందైన విందు చేయాలంటే సీతయ్య దాబా బెస్ట్ స్పాట్ అంటున్నారు. వీకెండ్స్‌లో అయితే ఇక్కడ ఫుడ్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తుంటామని ఆ రెస్టారెంట్‌కు వచ్చిన ఓ కస్టమర్‌ చెబుతున్నారు. రాత్రి పూట లైట్ ఫుడ్ తినాలకునే… మాంసాహారులకు కూడా ఇది మంచి ప్లేస్‌.

  ఇది చదవండి: ఈ ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్ అవసరం లేదు.. ఫుడ్ ఆర్డర్ ఇస్తే చాలు..


  పేరుకు తగ్గట్టుగానే ఉన్న సీతయ్య విలేజ్‌ దాబా స్టయిల్‌లో ఉన్న ఈ రెస్టారెంట్‌ను మీరు విజిట్‌ చేయాలనుకుంటున్నారా..?
  అడ్రస్‌ : సీతయ్య విలేజ్‌ దాబా, శారదా కాలేజ్‌ సిగ్నల్స్‌, బీఆర్‌టీఎస్‌ రోడ్‌, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌- 520003, ఫోన్: 9581959545

  Vijayawada Seethaiah Village Dhaba

  ఎలా వెళ్లాలి?
  బస్టాండ్‌ నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఈ విలేజ్‌దాబా ఉంది. విజయవాడ బస్టాండ్‌ నుంచి లోకల్‌ ఆటోలు, సిటీ బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు