హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

విజయవాడ వాసులకు గుడ్ న్యూస్.. ఇవాల్టి నుంచే షిర్డీకి విమాన సర్వీసులు ప్రారంభం

విజయవాడ వాసులకు గుడ్ న్యూస్.. ఇవాల్టి నుంచే షిర్డీకి విమాన సర్వీసులు ప్రారంభం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ నుంచి షిర్డీకి 2:50 గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. విమానం ఇవాళ మధ్యాహ్నం 12:25 గంటలకు గన్నవరంలో బయలుదేరి 3 గంటలకు శిర్డీ చేరుకుంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

విజయవాడ వాసులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం వందలాది భక్తులు శిర్టీ సాయి దర్శనం కోసం.. తరలి వెళ్తుంటారు. అయితే ఇప్పటివరకు బస్సులు, రైళ్లలోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రయాణం మరింత సులభం చేసేందుకు ఇవాల్టి నుంచి విజయవాడ నుంచి షిర్డీకి విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శిర్డీకి ప్రతి రోజూ విమాన సర్వీసును నిర్వహించాలని ఇండిగో సంస్థ నిర్ణయించింది.

మార్చి 27 ఆదివారం నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఇండిగో సంస్థ ప్రతినిధులు శనివారం వెల్లడించారు. సుమారు 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఈ విమానం.. ఈ రోజూ మధ్యాహ్నం 12:25 గంటలకు గన్నవరంలో బయలుదేరి 3 గంటలకు శిర్డీ చేరుకుంటుంది. మరో సర్వీసు శిర్డీ నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరి.. 04:26 గంటలకు విజయవాడ వస్తుంది. టిక్కెట్‌ ధరను రూ.4,639 గా నిర్ణయించారు.

ఇప్పటిదాకా రోడ్డు,రైలు మార్గాల ద్వారా గంటల తరబడి ప్రయాణం చేసి షిర్డీ  వెళ్తున్నవారికి ఈ విమాన సర్వీసుల ప్రారంభం ఇది నిజంగా గుడ్ న్యూస్ కానుంది. విజయవాడ నుంచి షిర్డీకి 2:50 గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా షిర్డీ నుంచి మరో విమానం మధ్యాహ్నాం 2:20గంటలకు బయల్దేరి సాయంత్రం 4:35గంటలకు గన్నవరం చేరుకుంటుందన ఇండిగో ఎయిర్ లైన్స్ వర్గాలు తెలిపాయి. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టిక్కెట్ ధర రూ. 4,246,అలాగే షిర్డీ నుంచి విజయవాడకి ప్రారంభ టిక్కెట్ ధర రూ.4,639గా నిర్ణయించారు.

First published:

Tags: IndiGo, Local News, Shirdi, Vijayawada

ఉత్తమ కథలు