రిపోర్టర్ :పవన్ కుమార్ న్యూస్18
లొకేషన్ : విజయవాడ
గొడవలు కారణంగా భర్త నుండి విడిపోయిన మంగమ్మ పుట్టింట్లోనే ఉంటుంది అప్పటి నుండీ ఆ పిల్లలను అన్ని తానై చూసుకునంటున్నాడు మంగమ్మ తండ్రి. విధి చిన్న చూపు చూడటం తో ఆ ఇద్దరు చిన్న పిల్లలు ఇప్పు డు అనాథలు అయ్యారు. నీటిని వేడి చేసుకునే వాటర్ హీట ర్ రెండు ప్రాణాలను బలికొంది. ఈ విషాదకరమైన సంఘటన విజయవాడలో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు
విజయవాడలోని రామకోటి మైదానం పాపిట్ల వారి వీధిలో జీవనం కొనసాగిస్తున్నారు... ఇప్పిలి సింహచలం(61). కుటుంబ పోషణకై పెయింటింగ్ పనులు చేసుకుంటూ అతని భార్య వరాలమ్మతోచిన్న పాత రేకుల షేడ్ లో ఉంటున్నారు. సింహాచలం కుమార్తె మంగమ్మ(32) భర్తతో విభేదాలు రావడంతో 6 సంవత్సరా లు, 9 సంవత్సరాలు వయస్సు ఉన్న కుమారులతో కలిసి పుట్టింట్లోనే ఉంటుంది.వయసుపై బడిన తండ్రిని చూసుకుంటూ ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో సింహచలంకు ఆరోగ్యం సరిగా ఉండేంది కాదు.
మంగమ్మ ఆమె తల్లి వరాలమ్మ కుటుంబ పోషణకై కొందరి ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ, సాయంత్రం వేళల్లో ఫుడ్ కోర్టు నందు పనులు చేసుకుంటూ బతుకు బండిని నడిపిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో పిల్లలకు స్నానము చేయించి ఇంటి పక్క వీధిలో ఉన్న ట్యూషన్ కి పంపింది మంగమ్మ. మంగమ్మ తండ్రి సింహాచలం కూడా స్నానం చేయడం కోసం వేసి నీళ్లు పెట్టుకోడానికి ఒక ప్లాస్టిక్ బకెట్ లో వాటర్ హీటర్ పెట్టి స్విచ్ వేసాడు.
స్విచ్ వేసిన సమయంలోనే కరెంట్ షాక్ తగిలి పెద్దగా అరవడంతో పక్కనే ఉన్న కూతురు మంగమ్మ తండ్రిని కాపాడే ప్రయత్నంలో కిందపడిపోతున్న సమయంలో తండ్రిని పట్టు కోవడంతో ఇద్దరకి కరెంట్ షాక్ తగిలి మరణించారు. పక్క గదిలో అద్దెకు ఉంటున్న సీత (54) వారిని కాపాడే ప్రయత్నంలో కరెంట్ షాక్ తగిలి తీవ్రమైన గాయాలు అవ్వడంతో ప్రాణాపాయ నుండి బతికి బయట పడింది. వరాలమ్మ భర్త,కూతురు మృతి చెందంతో ఆ ఇద్దరి చిన్న పిల్లలుని చూసి వరాలమ్మ భోరున విలపించడంతో చుట్టుపక్కల స్థానికులను కన్నీరు పెట్టిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada