హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: షాపు ఫస్ట్ ఫ్లోర్... ఇల్లు ఐదో ఫ్లోర్... మధ్యలోనే జరిగింది అసలు మాయ.. ఎంటో తెలిస్తే షాక్ అవతారు..

Andhra Pradesh: షాపు ఫస్ట్ ఫ్లోర్... ఇల్లు ఐదో ఫ్లోర్... మధ్యలోనే జరిగింది అసలు మాయ.. ఎంటో తెలిస్తే షాక్ అవతారు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కొన్నిసార్లు నమ్మకంగా పనిచేసే వాళ్లే యజమానులను ముంచేస్తారు. దీంతో ఎవర్ని నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి.

  ఎవరు ఏం చేసినా పక్కా ప్లాన్ తో చేయాలి. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా.. ఇంకేదైనా... కానీ ఓ వ్యక్తి చాలా పక్కాగా ప్లాన్ చేసి పోలీసులకే సవాల్ విసిరేలా దొంగనాన్ని ముగించాడు. అస్సలు డౌట్ రాకుండా.. ఎక్కడా తప్పు జరగకుండా..యజమానే సొత్తును తన చేతికి ఇచ్చేలా ప్లాన్ చేశాడు. ఏకంగా ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే 10కిలోల బంగారంతో ఎస్కేప్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని గవర్నర్ పేట జైహింద్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో మహవీర్ జైన్ అనే వ్యక్తి.. రాహుల్ జ్యువెలరీ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. అదే కాంప్లెక్స్ ఐదో అంతస్తులో కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. మహవీర్ జైన్ వద్ద హర్ష, రవితేజ అనే ఇద్దరు గుమాస్తాలుగా పనిచేస్తోంది. కరోనా వల్ల వ్యాపారం అంతగా సాగకపోవడంతో బంగారు ఆభరణాలను ఇంట్లోనే ఉంచి.. కస్టరమర్లు వచ్చినట్లు గుమాస్తాలను పంపి వాటిని షాపులో చూపిస్తున్నాడు. ఆ తర్వాత వాటిని ఇంటికి పంపిస్తున్నాడు.

  ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11గంటల సమయంలో కస్టమర్లు రావడంతో మహవీర్ జైన్.. ఇద్దరు గుమస్తాలను ఇంటికి పంపి రెండు ఆభరణాలను తెప్పించాడు. కాసేపటి తర్వాత ఆభరణాలను ఇంటికి పంపించాడు. ఓ అరగంట తర్వాత మహవీర్ జైన్.. తన సోదరుడు కొవిడ్ తో చికిత్స పొందుతుండగా అతన్ని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన గుమస్తా హర్ష.. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మహవీర్ ఇంటికెళ్లి ఆభరణాలు అడిగాడు. దీంతో ఎప్పటిలాగే కస్టమర్లు వచ్చారనుకొని మహవీర్ భార్య, కుమారులు ఆభరణాలతో కూడిన రెండు బ్యాగులను హర్షకు ఇచ్చారు. . అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

  ఇది చదవండి: బిడ్డ బర్త్ డే ఘనంగా చేయలేదని అలా చేస్తారా..? పేగు బంధాన్ని మరిచిన కన్నతల్లి


  ఆస్పత్రి నుంచి సాయంత్రానికి ఇంటికి చేరుకున్న మహవీర్.. బుధవారం ఉదయం షాపు తెరిచి.. ఆభరణాల కోసం చూడగా.. జరిగిన విషయం బయటపడింది. దీంతో షాక్ కు గురైన మహవీర్ జైన్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహవీర్ దగ్గర ఏడాదిగా పనిచేస్తున్న హర్ష.. తనకు సంబంధించిన ఆధారాలేవీ అక్కడ లేకుండా జాగ్రత్తపడ్డాడు. స్థానికుడే అయినా అడ్రస్ గానీ, ఆధార్ కార్డుగానీ, చివరకు ఫోటో కూడా లేకుండా అప్రమత్తంగా వ్యవహించినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ లో లభ్యమైన వివరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడ్ని పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు ఘటనాస్థలిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో విజయవాడ వన్ టౌన్ ప్లాంతంలోని బంగారం తయారీ వ్యాపారి వద్ద నుంచి గుమాస్తానే భారీ చోరీకి పాల్పిన సంగతి తెలిసిందే.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Gold robbery, Theft, Vijayawada

  ఉత్తమ కథలు