హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada News: వాట్సాప్ కు అమ్మాయిల ఫోటోలు పెడితే థ్రిల్ అయ్యాడు.. కాసేపటికే ఎకౌంట్ ఖాళీ.. పోలీసులు ఊరుకుంటారా..?

Vijayawada News: వాట్సాప్ కు అమ్మాయిల ఫోటోలు పెడితే థ్రిల్ అయ్యాడు.. కాసేపటికే ఎకౌంట్ ఖాళీ.. పోలీసులు ఊరుకుంటారా..?

పోలీసుల అదుపులో నిందితుడు

పోలీసుల అదుపులో నిందితుడు

Vijayawada: ఈ రోజుల్లో దొంగతనాల కంటే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే, ఎలాంటి హాని జరగకుండానే మన ఖాతాలో డబ్బులు ఖాళీ అయిపోతుంటాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చినా, వాళ్లు ఓటీపీలు అడిగినా చెప్పొద్దంటూ పోలీసులు మొత్తుకుంటున్నా.. అన్నీ తెలిసినవారు కూడా అడ్డంగా మునిగిపోతున్నారు.

ఇంకా చదవండి ...

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

ఈ రోజుల్లో దొంగతనాల కంటే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే, ఎలాంటి హాని జరగకుండానే మన ఖాతాలో డబ్బులు ఖాళీ అయిపోతుంటాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చినా, వాళ్లు ఓటీపీలు అడిగినా చెప్పొద్దంటూ పోలీసులు మొత్తుకుంటున్నా.. అన్నీ తెలిసినవారు కూడా అడ్డంగా మునిగిపోతున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా కేటుగాళ్ల మాయలో పడిపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తికి అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి ఎకౌంట్ ఖాళీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఎన్టీఆర్ విజయవాడ జిల్లా (NTR Vijayawada District) నందిగామ సమీపంలోని అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్న సంజయ్ కుమార్ అనే వ్యక్తికి ఇటీవల వాట్సాప్ కు అందమైన అమ్మాయిల ఫోటోలు వచ్చాయి.

ఆ వెంటనే సంజయ్ కుమార్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీకు నచ్చితే అమ్మాయిలను పంపుతామంటూ అవతలివైపు వ్యక్తి చెప్పారు. అందుకు ముందుగా అడ్వాన్స్ చెల్లించాలని చెప్పారు. ఫోన్ పే ద్వారా డబ్బు పంపించాలని కోరగా.. తనకు ఫోన్ పే లేదని సంజయ్ సమాధానమిచ్చారు. ఐతే మీ కార్డు నెంబర్ చెప్తే డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకుంటానని చెప్పారు. అప్పటికే అమ్మాయిల ఫోటోలతో ఫిదా అయిపోయిన సంజయ్.., వెంటనే కార్డు నెంబర్ చెప్పేశాడు. దీంతో ఇంకేముంది మోసగాళ్లు సంజయ్ కార్డు నుంచి ఏకంగా రూ.2,45,000 వేలు కాజేశారు.

ఇది చదవండి: భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడని 15 కత్తిపోట్లు.. నడిరోడ్డుపై దారుణం...


వెంటనే తాను మోసపోయానని తెలుసుకున్న సంజయ్.. చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో టెక్నాలజీ సాయంతో కేసును దర్యాప్తు చేసిన జగ్గయ్యపేట ఎస్సై.. మోసగాళ్లు రాజస్థాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మోసగాళ్ల కదలికలు, లావాదేవీలపై దృష్టిపెట్టిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అన్నీ పక్కాగా కన్ఫామ్ చేసుకున్న తర్వాత రాజస్థాన్ లో ఉండి ఆపరేట్ చేస్తున్న మోసగాడు జీవన్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అతడ్ని విచారించగా.. కాల్ గర్ల్స్ పేరుతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద రూ.1,50,000, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రాజస్థాన్ నుంచి జగ్గయ్యపేట తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.

ఇటీవల ఏపీలో ఇలాంటి మోసాలు పెరిగిపోతున్నాయి. మంగళగిరికి చెందిన యువతికి ఆన్ లైన్లో పరిచయమైన వ్యక్తి.. పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించి భారీగా డబ్బులు కాజేశాడు. ఐతే మోసపోయానని తెలుసుకొని మానసికంగా కలత చెందిన యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

First published:

Tags: Andhra Pradesh, Vijayawada

ఉత్తమ కథలు