Home /News /andhra-pradesh /

VIJAYAWADA VIJAYAWADA POLICE ARRESTED CHEATER FOR ROBBING SINGLE WOMAN IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Vijayawada: ఒంటరి మహిళలే అతడి టార్గెట్.. మాటల్లోకి దించి లాడ్జికి తీసుకెళ్తాడు.. ఆపై మత్తుమందు ఇచ్చి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Cheating: ఈ రోజుల్లో మోసగాళ్లకు కొదవే లేదు. మాయమాటలు చెప్పి అందినకాడికి దోచేస్తుంటారు. వారి వలలో పడేవాళ్లునంత కాలం.. కేటుగాళ్ల ఆటలు సాగుతూనే ఉంటాయి. అలా ఓ మోసగాడు మహిళలకు ఇట్టే బుట్టలో వేసుకోవడం వారి నుంచి అందినంత లాగేసుకొని ఉడాయించడమే డ్యూటీగా పెట్టుకున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    ఈ రోజుల్లో మోసగాళ్లకు కొదవే లేదు. మాయమాటలు చెప్పి అందినకాడికి దోచేస్తుంటారు. వారి వలలో పడేవాళ్లునంత కాలం.. కేటుగాళ్ల ఆటలు సాగుతూనే ఉంటాయి. అలా ఓ మోసగాడు మహిళలకు ఇట్టే బుట్టలో వేసుకోవడం వారి నుంచి అందినంత లాగేసుకొని ఉడాయించడమే డ్యూటీగా పెట్టుకున్నాడు. తానో బంగారం వ్యాపారినని లేక ధనవంతుడనని చెప్పుకుంటాడు చంద్ర. ఆలా చెప్పుకొని ఒంటరి మహిళలతో స్నేహం పెంచుకుంటాడు. మాటలతో మభ్యపెడతాడు. అంత అంటాడు ఇంత అంటాడే గంగరాజు సామెతలా తనను తాను మహిళల దగ్గర ప్రమోట్ చేసుకుంటాడు. అనంతరం వారిని లోబరుచుకుంటాడు. లాడ్జికి తీసుకెళ్లి లూటీ చేసి పారిపోతాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District) కు చెందిన చంద్ర చిన్నప్పటి నుండి తల్లితండ్రులను వొదిలేసి ఒంటరిగా రూమ్ అద్దెకు తీసుకొని ఉండేవాడు.

    కొంతకాలం గూడూరులో పనిచేసాడు తరువాత తిరుపతి వెళ్లి స్థిరపడ్డాడు. బస్టాండ్ పరిసరప్రాంతాల్లో నివసించేవాడు. అక్కడ కూడా మహిళలకు తాను బంగారం వ్యాపారినని వారితో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలిగేవాడు. మాయమాటలు చెప్పి వారిని లాడ్జిలకు తీసుకు వెళ్లి మత్తు మందు ఇచ్చేవాడు. మహిళలు మత్తులో జారుకున్న తర్వాత వారి ఒంటిపై బంగారాన్ని దొంగిలించి ఉడాయించేవాడు.

    ఇది చదవండి: వరుసకు చెల్లి.. ప్రేమ పేరుతో వేధింపులు.. చివరికి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..!


    ఇలా విజయవాడలో జూన్ నెలలో భవానీపురానికి చెందిన మహిళను మోసం చేసి సుమారు 36 గ్రాముల బంగారాన్ని దోచుకున్నాడు. ఇదే తరహాలో జులై నెలలో మరో మహిళను మోసం చేసి సుమారు 52 గ్రాముల బంగారం దోచుకున్నాడు. ఈ రెండు ఘటనలపై పిర్యాదులు అందుకున్న పోలీసులు ఇటువంటి తరహా నేరగాళ్లేవారు అన్న కోణం లో విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో వారికి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు చంద్ర ఒంటరి మహిళలను మాత్రమే ఎంచుకొని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు.

    ఇది చదవండి: ప్రియుడితో కలిసి భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది.. ఆ తర్వాత ఊహించని స్కెచ్ వేసింది..


    గత పన్నండేళ్లుగా చంద్ర ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన మరో మహిళను మభ్యపెట్టిన చంద్ర.. ఆమెను కలిసేందుకు విజయవాడ వస్తున్నాడని గుర్తించారు. పక్కా స్కెచ్ తో బస్టాండ్ లో నిఘా ఉంచిన పోలీసులు అతడ్ని చాకచక్యంగా అధువులోకి తీసుకున్నారు.

    ఇది చదవండి: ప్రియుడితో లేచిపోయిన భార్య.. అవమానంతో కుంగిపోయిన భర్త ఏం చేశాడంటే..!


    ఇతర ప్రాంతాలకు వెళ్లిన మహిళలు అపరిచిత వ్యక్తులు మాటలు నమ్మవద్దని.. ఎవరైనా అనుమానంగా కనిపించినా, మోసం చేస్తున్నారన్న డౌట్ వచ్చినా వెంటనే 100కి గానీ, దిశ యాప్ ద్వారాగానీ తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్పారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే వెలుగుచూశాయి. ఇలాంటి ఘటనల్లో చాలా మంది జరిగిన విషయాన్ని బయటకు చెప్పలేక మిన్నకుండిపోతున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు