హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: ఆ కాలేజ్​లో ఫ్రీగా పని చేయాలా..? జీతం ఇవ్వకుండానే ఇచ్చినట్టు సంతకం పెట్టాలా..?

Vijayawada: ఆ కాలేజ్​లో ఫ్రీగా పని చేయాలా..? జీతం ఇవ్వకుండానే ఇచ్చినట్టు సంతకం పెట్టాలా..?

ఆ కాలేజ్ లో పని చేస్తే జీతాలు ఉండవు

ఆ కాలేజ్ లో పని చేస్తే జీతాలు ఉండవు

Vijayawada: అదో పేరు ఉన్న ప్రముఖ కాలేజ్.. భారీగా ఫీజులు వసూళ్లు చేస్తుంటారు.. విద్యార్థులను జాయిన్ చేసుకునేందుకు భారీ ప్రకటనలు కూడా చేస్తారు.. కానీ అక్కడ పని చేసే వారు మాత్రం ఫీగా ఉద్యోగం చేయాలా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

K Pawan Kumar, News18, Vijayawada

తమ కాలేజ్ చాలా ప్రత్యేకమైంది అంటారు.. భారీ ప్రకటనలు.. గొప్పలు చెబుతూ విద్యార్థులను ఆకర్షిస్తారు.. భారీగా ఫీజులు కూడా కట్టించుకుంటారు.. అద్భుతమైన ఫ్యాకల్లీ తమ సొంతం అంటారు.. కానీ అసలు విషయం తెలిస్తే.. ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. అక్కడ పని చేసేవారికి కనీసం జీతాలు కూడా ఇవ్వరా..? ఇంతకీ ఏం జరిగింది అంటే.. జూపూడి నోవా కళాశాల (Jupudi Nova College ) యాజమాన్యం వేతనం..  సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు అని విజయవాడ (Vijayawada) కు చెందిన అధ్యాపకురాలు రత్న కుమారి ఆరోపించారు.

గతంలో ఇవ్వాల్సిన జీతం, సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యమే తనను పిలిపించారని తీరా రాగానే జీతం ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా సంతకం చేయమని చాలా ఒత్తిడికి గురి చేస్తున్నారు ఆవేదన చెందుతున్నారు. 2016 నుండి 2020 వరకూ దాదాపుగా నాలుగేళ్ళ పాటు కళాశాలలో లెక్చరర్గా పని చేసారని ఉద్యోగం మానేసి రెండేళ్లు అవుతున్న కూడా వేతనం అప్పటికే ఏడాది జీతం పెండింగ్ ఉందన్నారు.

ఆమె వేతనం,సర్టిఫికెట్లు ఇవ్వాలని పలుమార్లు అడిగిన యాజమాన్యం ఏ మాత్రం స్పదించడం లేదని వాపోయారు. భరించలేక యాజమాన్యంపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయగా వారు యజమాన్యానికి కొంత సమయం ఇచ్చారు. ఈలోపు ఇస్తారేమో అని వేచి చూసిన ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండటంతో ఆమె మరల ఉన్నత అధికారులను కలిసి అంత వివరించగా వారు మేము ఇప్పిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి : ఆ జిల్లాల మధ్య జర్నీ ఇక చాలా ఈజీ.. 9వేల కోట్లతో రహదారి నిర్మాణం

మంగళవారం ఆమెకు ఫోన్ చేసి పిలిపించారు ఆమె మధ్యాహ్నం నుండి రాత్రి 7 గంటలు వరకు వేచి చూసిన ఆమెకు ఇవ్వాల్సిన వేతనం గాని, సర్టిఫికెట్లు గాని ఏమీ ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. చేసిన ఉద్యోగానికి జీతం ఇవ్వకుండా ఇచినట్టుగా సంతకం చేయమని రత్నకుమారిని ఒత్తిడి చేస్తున్నారని... అలా సంతకం చేస్తేనే ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇస్తాను అంటూ బెదిరిస్తున్నారని ఇప్పటికైనా జీతాన్ని,సర్టిఫికెట్లు ఇప్పించమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : వైసీపీ డ్రామాలు ఆడుతోందా..? బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆమెని యాజమాన్యం అంతగాఎందుకు ఇలా బెదిరింస్తున్నారు. ఇది అంత చూస్తూ ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా ఇన్ని నెలలుగా బాధితురాలు కూడా ఎటువంటి కంప్లైంట్ ఎందుకు ఇవ్వకుండా ఉన్నారంటూ...రక రకాల ప్రశ్నలు వేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో ఇప్పటికైనా తెలియాలి అంటూ వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Vijayawada

ఉత్తమ కథలు