హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kesineni Nani: ప్లేస్, టైమ్ ఫిక్స్ చేస్తే కొట్టేసుకుందాం...! వైసీపీకి బెజవాడ నాని ఛాలెంజ్

Kesineni Nani: ప్లేస్, టైమ్ ఫిక్స్ చేస్తే కొట్టేసుకుందాం...! వైసీపీకి బెజవాడ నాని ఛాలెంజ్

వైసీపీకి కేశినేని నాని ఛాలెంజ్

వైసీపీకి కేశినేని నాని ఛాలెంజ్

గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) హాట్ హాట్ గా మారిన సంగతి తెలిసిందే..! అధికార వైఎస్ఆర్సీపీ (YSRCP), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల (Telugu Desham Party) మధ్య డైలాగ్ వార్ కాస్తా ఫిజికల్ ఫైటింగ్ కు దారితీసింది.

ఇంకా చదవండి ...

  గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) హాట్ హాట్ గా మారిన సంగతి తెలిసిందే..! అధికార వైఎస్ఆర్సీపీ (YSRCP), ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల (Telugu Desham Party) మధ్య డైలాగ్ వార్ కాస్తా ఫిజికల్ ఫైటింగ్ కు దారితీసింది. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఆఫీసుపై దాడికి నిరసనగా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) దీక్షకు దిగిన సంగతి తెలిసిందే..! చంద్రబాబు దీక్షకు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) సంఘీభావం తెలిపారు. నాని బీజేపీలో చేరుతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన పార్టీ కార్యాలయానికి రావడంతో కార్యకర్తల్లో జోషే వచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. బాలయ్యబాబు స్టైల్లో అధికార పార్టీకి ఛాలెంజ్ విసిరారు. దీంతో పొలిటికల్ ఫైటింగ్ సీరియస్ టర్నింగ్ తీసుకుంది.

  ప్లేస్, టైమ్ చెప్తే వస్తాం.. కొట్టేసుకుందాం..!

  ఈ సందర్భంగా కేశినేని నాని తీవ్రవ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే వీరుడు సూరుడని చెప్పుకుంటారని.., ఏదైనా ఉంటే చెప్పండి డైరెక్ట్ ఫైట్ చేసుకుందామని ఛాలెంజ్ విసిరారు. “విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్సా..? వీఎంసీ గ్రౌండ్సా ఏదోకటి తేల్చేసుకుందాం.వైసీపీ నేతలు టైమ్.. డేట్ చెబితే మేమూ వచ్చేస్తాం. వైసీపీ ఎక్కడంటే అక్కడ మా వాళ్లు రెడీగా ఉన్నారు.. కొట్టుకుందాం అంటే కొట్టేసుకుందాం.రోజూ కొట్టుకుంటూ ఏపీకి చెడ్డ పేరు తేవద్దు. జగన్ రాక్షస పాలనను ప్రపంచం అంతా చెప్పుకుంటోంది.” అని ఛాలెంజ్ విసిరారు.

  ఇది చదవండి: అలా చేస్తే బీజేపీలో టీడీపీ విలీనం... చంద్రబాబు ప్రతిపాదన.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు..  రౌడీయిజం, గుండాయిజం అంటే పిరికిచర్యన్న నాని.. 2019లో జగనుకు గొప్ప అవకాశం వచ్చిందని.. అలాంటి అవకాశం వస్తే ప్రజాతీర్పును గౌరవించాలిగానీ ఇలా చేస్తే సరికాదన్నారు. ఏం చేసినా ప్రజలు ఒప్పుకుంటారని భావిస్తే అది చెల్లుబాటు కాదని.., ఓటర్లు తగిన సమయంలో మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా శాంతి భద్రతల సమస్య వచ్చిందా..? టీడీపీ హయాంలో వైసీపీ వాళ్లు తప్పు చేసిన సంయమనంతో ఉన్నామని గుర్తుచేశారు.

  ఇది చదవండి: పవన్ రాజకీయ వ్యూహం మారబోతోందా..? ఆ పార్టీకి షాకివ్వబోతున్నారా..?  “రేపనేది ఉంటుందని జగన్ గుర్తుంచుకోవాలి. హిట్లర్, సద్దాం వంటి డిక్టేటర్లను చూశాం... జగనుకు త్వరలో ప్రజలు బుద్ది చెబుతారు. ఏపీని జగన్ ఏం చేద్దామనుకుంటున్నారు..? విజ్ఞాన గనిగా ఉన్న ఏపీని గుండా ఏపీని చేస్తారా..? రౌడీ ఏపీ చేస్తారా..? ఏపీలోని యువతను డ్రగ్ ఎడిక్టులను చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారా..? ఏపీలో పిల్లలను చదివించాలంటే డ్రగ్స్ బారిన పడతారేమోననే భయం తల్లిదండ్రుల్లో కన్పిస్తోంది. మద్య నిషేధం చేస్తానని జగన్ చెబితే.. వైసీపీ నేతలే సారాకు రంగేసి మద్యం అమ్ముతున్నారు.ప్రస్తుతం అనేక నేరాలు జరగడానికి కారణం మద్యం పాలసీనే.” అని నాని అన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Kesineni Nani, TDP, Ysrcp

  ఉత్తమ కథలు