హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kesineni Family: బెజవాడలో కేశినేని బ్రదర్స్ వార్..! దేనికైనా రెడీ.. నానికి చిన్ని ఛాలెంజ్..!

Kesineni Family: బెజవాడలో కేశినేని బ్రదర్స్ వార్..! దేనికైనా రెడీ.. నానికి చిన్ని ఛాలెంజ్..!

కేశినేని నాని, కేశినేని చిన్ని (ఫైల్)

కేశినేని నాని, కేశినేని చిన్ని (ఫైల్)

విజయవాడ (Vijayawada) రాజకీయాల్లో ఫ్యామిలీ వార్ మరింత ముదురుతోంది. ఎంపీ కేశినేని నాని (MP Kesineni Nani) కుటుంబ వ్యవహారం టీడీపీ (TDP) లో హాట్ టాపిక్ గా మారింది. కేశినేని నాని తన సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్నిపై పోలీస్ కంప్లైంట్ చేయడంతో వివాదం రచ్చకెక్కింది.

ఇంకా చదవండి ...

విజయవాడ (Vijayawada) రాజకీయాల్లో ఫ్యామిలీ వార్ మరింత ముదురుతోంది. ఎంపీ కేశినేని నాని (MP Kesineni Nani) కుటుంబ వ్యవహారం టీడీపీ (TDP) లో హాట్ టాపిక్ గా మారింది. కేశినేని నాని తన సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్నిపై పోలీస్ కంప్లైంట్ చేయడంతో వివాదం రచ్చకెక్కింది. దీనిపై కేశినేని నాని స్పందించారు. ఓ చిల్లర వివాదంలోకి ఎంపీ కేశినేని నాని నా కుటుంబాన్ని లాగడం బాధాకరమని.., ఆ స్టిక్కర్ ఎవరిదో ఏంటో విచారణలో తేలనివ్వాలంటూ కామెంట్ చేశారు. కేసు విషయమై తన కారును హైదరాబాద్ లో పోలీసులు అడ్డుకున్నారని.. కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లి ఎంక్వైరీ చేసినట్లు కేశినేని చిన్ని వెల్లడించారు. పార్టీలో తాను ఓ చిన్న కార్యకర్త మాత్రమే అని.., చంద్రబాబు సీఎం కావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

ఆటో నగర్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరపాలని భావిస్తే.. దానిని వివాదం చేశారని విమర్శించారు. నాని తనకు శత్రువు కాదని.., సొంత అన్న.. తాను మాత్రం పార్టీలో చిన్న కార్యకర్తలనని చిన్ని స్పష్టం చేశారు. నేను ఎంపీగా పోటీ చేస్తానని నేను టిక్కెట్ అడగలేదని.., చంద్రబాబు ఏం చెబితే అది చేయడానికి తాను సిద్ధమని కేశినేని చిన్ని స్పష్టం చేశారు.

ఇది చదవండి: ఏపీలో మరో పోర్టుకు శ్రీకారం.. రామాయంపట్నంకు సీఎం శంకుస్థాపన..!


తాను ఏదైనా తప్పు చేసుంటే ఇప్పటికే బయటపడేదని.., రెండు నెలల నుంచి మాత్రమే వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారని.. ఇప్పుడే కంప్లైంట్ ఎందుకొచ్చింది..? అని ప్రశ్నించారు. ప్రస్తుతం తన కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదని.., కారు విషయంలో హైదరాబాద్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. నాపై ఫిర్యాదు వ్యక్తిగత వ్యవహరమే కానీ.. రాజకీయపరమైన కారణం కాదన్నారాయన. రాజకీయంగా విమర్శలు చేయొచ్చుగానీ.., ఇంట్లో ఆడవాళ్లను బయటకు లాగడం సరికాదన్నారు చిన్ని. పార్టీ ఆదేశిస్తే.. దేనికి అయిన రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు.

ఇది చదవండి: పవన్ వర్సెస్ గంటా.. ఆసక్తిని రేకెత్తిస్తున్న గాజువాక వార్.. 2024లో హైలెట్ ఇదేనా..?


ఇదిలా ఉంటే కొందరు వ్యక్తులు కారుపై తన పేరుతో స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్నారంటూ కేశినేని నాని మే 27వ విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జూన్ 9న ఎఫ్ఐఆర్ నమోదైంది. నాని ఫిర్యాదు మేరకు నిందితులపై 420, 415, 416, 468, 498 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. సదరు వాహనం నెంబర్ టీఎస్07డబ్ల్యూ 7777. ఈ వాహనం కేశినేని జానకీలక్ష్మి పేరిట ఉంది. ఆ కారును ఆమె భర్త, కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని వినియోగిస్తున్నారు. సోదరుడిపైనే కేశినేని నాని ఫిర్యాదు చేయడం విజయవాడలో సంచలనంగా మారింది.

కేశినేని శివనాథ్ కొంతకాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కేశినేని నాని స్థానంలో కేశినేని శివనాథ్ టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబే.. నానికి వ్యతిరేకంగా శివనాథ్ ను ప్రోత్సహిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. కొంతకాలంగా కేశినేని నాని పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. టీడీపీ మహానాడుకు కూడా ఆయన హాజరుకాలేదు.

First published:

Tags: Andhra Pradesh, Kesineni Nani, TDP, Vijayawada