Home /News /andhra-pradesh /

Andhra Pradesh: కుండలో బంగారం పెడితే రెట్టింపు అవుతుందంటూ పూజలు... 21 రోజుల తర్వాత తెరిచి చూస్తే...

Andhra Pradesh: కుండలో బంగారం పెడితే రెట్టింపు అవుతుందంటూ పూజలు... 21 రోజుల తర్వాత తెరిచి చూస్తే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా చూశారా..? అందులో బంగారాన్ని గంగానదిలో వేస్తే రెట్టింపు అవుతుందని బ్రహ్మానందం నమ్మించి మోసం చేస్తాడు. సేమ్ టు సేమ్ అలాంటి సీన్ ఏపీలో జరిగింది.

  బంగారు ఆభరణాలంటే అంటే ఆడవాళ్లకు ఎక్కడలేని పిచ్చి. పసిడి కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడరు. అదే ఊరికే బంగారం వస్తుందంటే ఎవరైనా ఏం చేస్తారు..? ఎగిరి గంతేస్తారు. మహిళల్లో బంగారంపై ఉండే మోజును క్యాష్ చేసుకోవాలనుకున్నాడో మోసగాడు. ఐడియా వచ్చిందేతడవుగా ఆచరణలో పెట్టేశాడు. మహిళలను బుట్టలో వేసుకొని మాయమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పెనమలూరు మండలకేంద్రంలో చెరువు కట్టపై నివశిస్తున్న కట్టా రాములమ్మ పెనమలూరు సెంటర్లో పూలవ్యాపారం చేస్తుంటుంది. ఈమెకు కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి తన పేరు హరి అని పరిచయం చేసుకున్నాడు. మీ దగ్గరున్న నగలు, నగదును రెట్టింపు చేస్తానంటూ ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం మాదిరిగా మాయమాటలు చెప్పాడు. నగదు, బంగారం తనకు ఇస్తే 21 రోజుల పాటు పూజలు చేసి వాటిని రెట్టింపు చేస్తానని నమ్మబలికాడు. దీంతో అతడి మాయ మాటలు నమ్మిన రాములమ్మ తనతో పాటు ఆమె కోడలు నాగమణి, ఆమె చెల్లెలు కోటేశ్వరమ్మ కలిసి రూ.2లక్షల నగదు, 30 కాసుల బంగారాన్ని అతడి చేతుల్లో పెట్టారు.

  దీంతో వాటిని మట్టికుండలో పెట్టి గంటల తరబడి పూజలు చేశాడు. 21 రోజుల తర్వాత వాటిని తెరిచి చూస్తే రెట్టింపు అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంకేముంది తమ దగ్గర ఉన్న సంపద రెట్టింపవుతుందని 21 రోజుల పాటు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. లక్ష్మీదేవి కటాక్షిస్తుందని భావించారు. ఈ క్రమంలో పూజలు చేసి 21 రోజులు గడవడంతో సోమవారం వారు కుండల మూతలు తీసి తీయగా షాక్ గురవడం వారి వంతైంది. అందులో డబ్బులుగానీ, బంగారం గానీ రెట్టింపు అవడం సంగతి పక్కనబెడితే.. అందులో చిల్లిగవ్వ లేదు. ఒట్టి మట్టికుండలే ఉన్నాయి. దీంతో మోసపోయామని గ్రహించిన రాములమ్మ, నాగమణి, కోటేశ్వరమ్మ పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

  ఇది చదవండి: ఏపీలో దండుపాళ్యం గ్యాంగ్... ఇంటినిండా కత్తులు బాంబులే...  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెనమలూరు సెంటర్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించేపనిలో ఉన్నారు. ఎవరైనా బంగారం రెట్టింపు చేస్తామంటూ వస్తే నమ్మొద్దని సూచిస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు కృష్ణాజిల్లాలో అక్కడక్కడా చోటు చేసుకున్నాయి. గతంలో ఉయ్యూరు పట్టణంలో సోది చెప్తానంటూ వచ్చిన మహిళ..బంగారాన్ని రెట్టింపు చేస్తానంటూ స్థానికులను నమ్మించి బంగారంతో ఉడాయించింది. అలాగే విజయవాడ భవానీపురంలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.  ఈ కేసుల్లో నిందితులు ఇంతవరకు పట్టుబడలేదు. మూఢనమ్మకాలు, మూఢభక్తిని నమ్మి మోసపోవద్దని పోలీసులు చెప్తున్నారు. జిల్లాలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రజల్లో మార్పు రాకపోవడం గమనార్హం.

  ఇది చదవండి: మదనపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామం.. ఇకనైనా మార్పు వస్తుందా..?

  మీ నగరం నుండి (​విజయవాడ)

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Cheating case, Crime news, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు