రోజురోజుకు లోన్ యాప్ వేధింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరొకరు ఈ వేధింపులకు బలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. విజయవాడ పాల ఫాక్టరీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మహమ్మద్.. హీరో ఫైనాన్స్ కార్పొరేషన్‌లో లోన్ తీసుకున్నారు. అయితే డబ్బు తిరిగి చెల్లిస్తున్నా.. ఇంకా కట్టాలంటూ అసభ్యకర మెసేజ్‌లు, కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్లు చేసి వేధింపులకు గురయ్యారు. దీంతో ఆ వేధింపులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మహమ్మద్.
దీంతో అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్‌కు రెండేళ్ల క్రితమే వివాహమైంది. ఐదు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. లింక్‌లు పంపి మరీ… లోన్ అడగకుండగానే.. లోన్ ఇచ్చేస్తున్న లోన్ యాప్‌లు.. ఆ తర్వాత వేధింపులకు గురిచేస్తూ ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీశాయి. అయితే పోలీసులు ఎంత హెచ్చరిస్తున్న కొందరు ఈ లోన్ యాప్ ల వలలో చిక్కి నష్టపోతున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
లోన్ యాప్‌ల జోలికి వెళ్లొద్దని పోలీసులు, అధికారులు ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించారు. అయితే కొందరు మాత్రం వాటి గురించి పూర్తిగా తెలియిక వాటిని ఇప్పటికీ వాటిని ఆశ్రయిస్తూనే ఉన్నారు.. వారి వలలో చిక్కుకుని వేధింపులు ఎదుర్కొంటున్నారు. కొందరు ప్రాణాలు తీసుకుని.. వారి కుటుంబాన్ని విషాదంలో ముంచేస్తున్నారు. అవసరం అయితే.. బయట అప్పు చేయండి.. కానీ, లోన్ యాప్‌లను ఆశ్రయించవద్దు అని పోలీసులు సూచిస్తున్నారు.. ఇక, కొన్ని లోన్ యాప్‌లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. మరికొన్నింటిపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Loan apps, Local News, Vijayawada