హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పేపర్ తో మ్యాజిక్ చేయాలంటే వీళ్ల తర్వాతే ఎవరైనా.. క్రియేటివిటీతో కేకపుట్టిస్తున్న చిన్నారులు

పేపర్ తో మ్యాజిక్ చేయాలంటే వీళ్ల తర్వాతే ఎవరైనా.. క్రియేటివిటీతో కేకపుట్టిస్తున్న చిన్నారులు

చిన్నారులు

చిన్నారులు తయారు చేసిన పేపర్ ఆర్ట్స్

Vijayawada: ఈ రోజుల్లో పిల్లలు ఏ వస్తువునైనా క్షణాల్లో పాడుచేస్తుంటారు. ఎంత ఖరీదు పెట్టి తెచ్చిన బొమ్మలైనా వాళ్ల చేతుల్లో పడితే ఇక అంతే సంగతులు. అయితే అలా పాడైపోయిన వాటిని మనకు సాధ్యమైనంతవరకు బాగుచేయాలనే ప్రయత్నించాలి.

  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

  ఈ రోజుల్లో పిల్లలు ఏ వస్తువునైనా క్షణాల్లో పాడుచేస్తుంటారు. ఎంత ఖరీదు పెట్టి తెచ్చిన బొమ్మలైనా వాళ్ల చేతుల్లో పడితే ఇక అంతే సంగతులు. అయితే అలా పాడైపోయిన వాటిని మనకు సాధ్యమైనంతవరకు బాగుచేయాలనే ప్రయత్నించాలి. అప్పుడే పిల్లలకు చిన్నవయసు నుంచే వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ను నేర్పించినవారమవుతాం. ఈ భూమి మీద ఏ వస్తువైనా రీయూజ్‌ చేయోచ్చని తెలుసుకుంటారు. ఈ ఆలోచనతోనే కేబీఎన్‌ కాలేజీ యాజమాన్యం చిన్నారులకు క్రాప్టింగ్‌, డై ఆర్ట్‌ లాంటివి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. పక్షులు, ఫ్లవర్ వాజ్‌లు, ఫ్లవర్స్‌, గిఫ్ట్‌ కార్డులు…ఇలా ఒకటి కాదు రెండు కాదు బోలెడన్ని రకరకాల బొమ్మలను… కేవలం ఇంట్లో లభించే పాత పేపర్లతో, కార్డ్ బాక్స్‌ లతో, పేపర్ టీ కప్‌లతో తయారు చేయోచ్చంటున్నారు చిన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యర్ధాలను వృథా పొవ్వినవం అంటున్నారు.

  ఉచిత పేపర్‌ క్రాప్టింగ్‌ శిక్షణ

  సాధారణంగా పిల్లలు సెలవలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తుంటారు. అలానే వేసవి సెలవలు వస్తే వారి ఆనందానికి అవధులుండవు. వేసవి సెలవులు కొంతమంది పిల్లలు వివిధ రకాల శిక్షణ నేర్చకోవడం కోసం కేటాయిస్తారు. అలాంటి వాళ్లకోసమే విజయవాడలోని వన్ టౌన్‌లో ఉన్న కేజీఎన్‌ కాలేజ్‌ ఉచిత పేపర్ క్రాఫ్టింగ్ శిక్షణా శిబిరం ఏర్పాటుచేసింది. ప్రతిభ కనబరుస్తున్న చిన్నారులు కేజీఎన్‌ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన పేపర్‌ క్రాప్టింగ్‌ క్లాస్‌ను చాలా మంచి చిన్నారులు వినియోగించుకున్నారు. ఇకపై బర్త్ డేలు, స్పెషల్ గ్రీటింగ్‌ కార్డులు, స్పెషల్ గిఫ్ట్ కూడా తామే తయారు చేసి స్నేహితులకి, ఫ్యామిలీ మెంబర్స్‌కు అందిస్తామంటున్నారు.

  ఇది చదవండి: ఆ ఆలయానికి తలుపులే ఉండవు.. అమ్మవారే అంతటికీ రక్ష


  ఇంట్లో లభించే వ్యర్థాలతో అంటే మనం తీసిపడేసే ప్రైస్‌ ట్యాగ్‌లు, బాక్స్‌లు, అగ్గిపెట్టెల బాక్స్‌లు..ఇలా ఎన్నింటినో వాడి రకరకాల పక్షుల్ని, పువ్వులను, బర్త్‌డే గిఫ్ట్‌ బాక్స్‌, వాల్‌ హ్యాంగర్స్‌ అంటూ తయారుచేసి వారెవా అనిపిస్తున్నారు. వేసవిలో నలబై రోజులు పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులు పిల్లల భవిష్యత్తుకు ఎంతగానో తోడ్పతుందని కళాశాల యజమన్యాం, ఇటు తల్లితండ్రులు తెలిపారు.

  ఇది చదవండి: ఏ కూరలో వేసినా లొట్టలేసుకుంటూ తినాల్సిందే..! రేటు మాత్రం టాప్ లేపుతోంది..!


  తల్లిదండ్రుల ఆనందం

  ఇలా తమ చిన్నారులు తయారుచేసిన క్రాఫ్ట్ లు చూసి తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు. వాటిని ఇంట్లో అలంకరణగా పెడుతూ పిల్లల్లో ఇంకాస్త ఆసక్తిని, కాన్ఫిడెన్స్‌ను పెంచుతున్నారు. ఇప్పటి వరకు కళ్ళ ముందు ఇన్ని రకాల వ్యర్థ పదార్థాలు ఉన్న వాటి విలువ తెలియ లేదని ఇప్పుడు తమ పిల్లలు తయారు చేస్తున్న ఈ బొమ్మల్ని చూస్తే మాటలు రావడం లేదంటున్నారు. ఇలాంటి శిక్షణ ప్రతి రోజు ఉన్నా… పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండిమహిళలకో డ్రైవింగ్ స్కూల్.., ఫీజు తక్కువ ప్రయోజనం ఎక్కువ.. ఎక్కడో తెలుసా..?


  పిల్లల భవిష్యత్‌ కోసం ఎంతదూరమైనా వెళ్తాం

  కేబీఎన్‌ కాలేజీ అంటే కేవలం విద్యా సంస్ధ మాత్రమే కాదని… కార్పొరేట్ బాధ్యత కలిగిన కళాశాల అని అన్నారు ప్రిన్సిపల్‌. ప్రతిఏటా వేసవిలో పిల్లల ఉజ్వల భవిష్యత్‌ కోసం వివిధ రకాల శిక్షణలు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.

  అడ్రస్‌: 9-42-104 కేటీ రోడ్‌, శ్రీనివాస మహల్‌ ఎదురుగా, కొత్తపేట్‌, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌-520001.

  కాలేజ్‌ వెబ్‌సైట్‌ : https://www.kbncollege.ac.in/

  మెయిల్‌ఐడీ : info@kbncollege.ac.in

  కాంటాక్ట్‌ నెంబర్‌: +91-866 -2565679

  KBN College, Vijayawada

  రాబోయే రోజుల్లో మరి కొన్ని రకాల శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Vijayawada

  ఉత్తమ కథలు