K Pawan Kumar, News18, Vijayawada
విజయవాడలోజ్యోతి రామలింగేశ్వర స్వామి వారు అంటే తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంద్రకీలాద్రిపై సుబ్రహ్మణ్యం స్వామివారితో పాటుగాఅదే ఆలయంలో ఎంతో మహిమాన్వితమైన దేవాలయంగా పేరుగాంచినది శ్రీ జ్యోతి రామలింగ స్వామి వారు.ఈ ఆలయం విజయవాడ కోమల విలాస్ సెంటర్లో ఉంది.
మెుదటగా జ్యోతి రామలింగేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం... ఈయన కుల పాటింపులు పట్టించుకునేవారు కాదు. పైగా అవి అమానవీయమని ప్రచారం చేసేవారు.కులభేదాలు లేకుండా అందరు సమానమేననిఆచరించి చూపాడు. ఈయన ఓ కవిగా, గాయకుడిగా పేరుగాంచాడు. తిరు అరుప్పా అనే పేరుతో 5,818 పద్యాలను కూడా రూపొందించాడు.తమిళనాడులోని చిదంబరం సమీపంలో మరుదూరు అనే గ్రామంలో అక్టోబర్ 5 1823 వ సంవత్సరంలోరామయ్య పిళ్ళై, చిన్నమ్మ అనే దంపతులకు జన్మించటం జరిగింది.
వివాహ జీవితం
1874 జనవరి 30 న ఈయన వడలూరు సమీపంలోని మెట్టుపాక్కం దగ్గర తన గదిలోకి ప్రవేశించి తన అనుచరులతో తలుపులు మూసివేయమని ఆదేశించాడు. ఆ తలుపులు ఎన్నటికీ తెరువరాదని, అలా తెరిచినా తాను వాళ్ళకి కనిపించనని వాళ్ళకి తెలియజేశాడు. ఆయన అదృశ్యం చుట్టుపక్కల కొన్ని పుకార్లు రేకెత్తించింది. చివరికి మే నెలలో ప్రభుత్వ తహసీల్దారుసమక్షంలో తలుపులు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించారు. కానీ అక్కడ జ్యోతి తప్ప మరేమీ కనిపించలేదు. ఈ సంఘటన 1906 లో మద్రాసు గెజిట్లో ప్రచురించబడింది.
జ్యోతి రామలింగ స్వామి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అయితేఆయన పిన తండ్రి రామలింగ స్వామిని పెంచారు.పిన తండ్రి పిల్లలుకు పాఠాలు,పద్యాలు వంటివి చెప్తుండే వారు ఒకరోజు ఆయన ఆరోగ్యం బాగోక రామలింగ స్వామిని బోధించమని ఆదేశించారు. దీంతోరామలింగ స్వామి పాఠాలు చెప్పటం మెుదలు పెట్టారు. అయితే ఆశ్చర్యమేమిటంటే...అర్ధరాత్రి 12 గంటలు అవుతున్న ఎవరు కదలకుండా రామలింగ పాఠాలువింటూనే ఉన్నారు. దీనిని బట్టి ఆయనలో ఎంత అద్భుతమైన ప్రతిభ ఉందో తెలుసుకోవచ్చు.
.
ఈ స్వామి వారు దాదాపుగా 300 సంవత్సరాల క్రితం 6000 కీర్తనలను రాసారు అది అప్పట్లో కరెంట్ లేకపోయినా ఆముదాపు దీపపు వెలుగులో ఈ కీర్తనలను రాసాడు. అలాగే ఆయన వెలిగించిన దీపం వెలుగుతూనే ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada