Home /News /andhra-pradesh /

VIJAYAWADA VIJAYAWADA DURGA TEMPLE BOARD TOOK KEY DECISION AHEAD OF DASARA NAVARATHRULU PRN GNT

Durga Temple: దసరాకు దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నారా..? అయితే ఇవి గుర్తుంచుకోండి.

విజయవాడ దుర్గ గుడి

విజయవాడ దుర్గ గుడి

Durga Temple: దసరా ఉత్సవాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దర్శన విధానంలో మార్పులు చేసింది..

    andhra pradesh, ap news, Endowment department news, ap temples news, temple illegal issues, Endowment department issued notice to regular checkups, ఆంధ్రప్రదేశ్,ఏపీ న్యూస్, ఏపీ దేవాదాయ శాఖ వార్తలు, ఏపీ దేవాలయాల్లో భారీగా అక్రమాలు, దేవాలయాల్లో అవినీతిపై దేవాదాయ శాఖ సీరియస్
    విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నందున పాలకమండలితో పాటు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దసరా సందర్భంగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశముండటంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


    Vijayawada Indra Keeladri, Viajayawada Durga Temple, Dasara festival in Durga Temple, Viajayadashami, Hindu Temple, Andhra Pradesh News, Andhra News, AP News, Telugu News, Breaking news in Telugu, విజయవాడ ఇంద్రకీలాద్రి, విజయవాడ దుర్గగుడి, దుర్గగుడిలో దసరా ఉత్సవాలు, విజయదశమి, హిందూ ఆలయం, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్
    దసరా ఉత్సవాల్లో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో దసరా ఉత్సవాల కో ఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.


    vijayawada, durgadevi temple, bejawada, vijayawada durga temple, vijayawada news, devi navarthri, gayathri devi, andhra pradesh, ap news, ఏపీ వార్తలు, ఏపీ తాజా వార్తలు, విజయవాడ, దుర్గాదేవీ ఆలయం, ఇంద్రకీలాద్రి, ఆంద్రప్రదేశ్ న్యూస్, దసరా ఉత్సవలు, దుర్గాదేవీ దసరా ఉత్సవాలు, విజయవాడ దసరా ఉత్సవాలు, ఇంద్రకీలాద్రి దేవీ నవరాత్రులు
    అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగనున్నాయి. కొవిడ్ దృష్ట్యా ఈ ఏడాది రోజుకు 30 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే మూలానక్షత్రం రోజున కేవలం 70 వేల మందికి మాత్రమే అనుమతి ఉండనుంది.


    andhrapradesh, vijayawada news, indrakeeladri, dusshera in indrakeeledri, bejawada kanakdurga, durgamma, indrakeeladri news
    దసరాలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్‌లైన్ స్లాట్ తప్పనిసరి చేసింది. ఆన్‌ లైన్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఉండనుంది. ఈ క్రమంలో కొండ కింద ఆన్‌లైన్ కౌంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేయనున్నారు.


    7న శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. 7న ఉదయం 9 గంటల నుంచి దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుంది. దసరాలో మాలధారణ గావించిన భక్తులకు అనుమతినివ్వాలో లేదా అనే దానిపై కో ఆర్డినేషన్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.


    అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భక్తులు మాస్క్, భౌతిక దూరం పాటిస్తూ రావాలని తెలిపారు. అలాగే కొండపై శానిజైర్లు, శానిటైజేషన్ పరికరాలను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు.


    ఈ సమావేశంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, సిపి బత్తిన శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జెసి మాధవి లత, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు పాల్గొన్నారు.


    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Vijayawada, Vijayawada Kanaka Durga

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు