Home /News /andhra-pradesh /

VIJAYAWADA VIJAYAWADA CYBER CRIME POLICE TO ISSUE NOTICE TO TWITTER CREATING FAKE ACCOUNTING ON THE NAME OF ANDHRA PRADESH DGP FULL DETAILS HERE PRN

Andhra Pradesh: ఏపీ పోలీస్ vs ట్విట్టర్... అసలేం జరిగిందంటే...!

ట్విట్టర్ కు నోటీసులివ్వనున్న ఏపీ పోలీసులు

ట్విట్టర్ కు నోటీసులివ్వనున్న ఏపీ పోలీసులు

ఈ నెల ఆరంభంలో డీజీపీ (AP DGP) పేరుతో ట్విట్టర్లో నకిలీ ఎకౌంట్ (Fake Twitter Account) క్రియేట్ అయింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ట్విట్టర్ ను సంప్రదించారు.

    ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ట్విట్టర్ కు మధ్య వార్ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఫేక్ ఎకౌంట్ వ్యవహారంలో విజయవాడ పోలీసులు ట్విట్టర్ కు నోటీసులివ్వనున్నారు. డీజీపీ పేరిట నకిలీ ట్విట్టర్‌ ఎకౌంట్ క్రియేట్ చేసిన కేసుకు సంబంధించి వివరాలివ్వాలని విజయవాడ పోలీసులు పంపిన మెయిల్‌ను ట్విట్టర్‌ యాజమాన్యం పట్టించుకోలేదు. ఇప్పటికి మూడుసార్లు విజ్ఞప్తి చేసినా ట్విట్టర్ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఖాతాదారుల సమాచారాన్ని ఇతరులతో పంచుకోలేమంటూ పోలీసులకు వివరించింది. అసలేం జరిగిందంటే.., ఈ నెల ఆరంభంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ‘డీజీపీ ఆంధ్రప్రదేశ్‌’ అనే పేరుతో ట్విట్టర్ లో ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేశారు. గౌతమ్ సవాంగ్ ఫోటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టారు. ఫేక్ ఎకౌంట్ ను వెంటనే గుర్తించిన పోలీసులు.. ఈ విషయాన్ని ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే డిలీట్ చేశారు.

    ఫేక్ ఎకౌంట్ వ్యవహారంలో విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎకౌంట్ ను ఏ ఐపీ అడ్రస్ తో క్రియేట్ చేశారు..? దీని వెనుక ఎవరున్నారు..? ఏమైనా కుట్ర జరుగుతుందా.? అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు ముందుకు సాగాలంటే ఐపీ అడ్రస్ కీలకమని భావించిన పోలీసులు.. వీటి కోసం పోలీసులు ట్విట్టర్ కు ఈ మెయిల్ చేశారు. ఐతే ఈ సమాచారం ఇవ్వడం సాధ్యం కాదని.. తమ యూజర్ల వివరాలను ఇవ్వడం సాధ్యం కాదని.. వారి వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతుందని ట్విట్టర్ రిప్లై ఇచ్చింది.

    ఇది చదవండి: పనిచేస్తున్న కర్ఫ్యూ, వ్యాక్సిన్.. ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు


    ఐతే కుట్రకోణంలో విచారణ జరపడానికి ఐపీ అడ్రస్ లాంటి వివరాలు ముఖ్యమని పోలీసులు మరో మెయిల్ పంపినా ట్విట్టర్ స్పందించలేదు. దర్యాప్తులో ఈ వివరాలు చాలా ముఖ్యమని.. అలా ఇవ్వకుంటే చట్టపరంగా ముందుకెళ్లాల్సి వస్తుందని మూడు సార్లు హెచ్చరించింది. అయినా సమాధానం రాకపోవడంతో నోటీసులివ్వాలని భావిస్తోంది.

    ఇది చదవండి: కాబోయే భర్తతో కలిసి షికారుకు వెళ్లిన యువతి... అక్కడే మాటువేసిన మృగాళ్లు.. తర్వాత ఏం జరిగిందంటే..!


    కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ కు ఐటీ చట్టం కింద ఇస్తున్న మినహాయింపులను ఇటీవలే తొలగించింది. దీంతో ట్విట్టర్లోని అన్ని అంశాలకు సదరు సంస్థ బాధ్యత వహించడంతో పాటు చట్టపరమైన కేసులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. నూతన చట్ట నిబంధనల ప్రకారం దర్యాప్తులో భాగంగా ఏదైనా సమాచారం అడిగితే వంటనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ ప్రారంతాల్లో నమోదైన కేసులకు సంబంధించి ట్విట్టర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ట్విట్టర్ కు నోటీసులిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: వానల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే..! వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..!

    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Police, Fake id, Twitter

    తదుపరి వార్తలు