K Pawan Kumar, News18, Vijayawada
ఆసియాలోనే అతిపెద్దదిగా ప్రసిద్ధికి ఎక్కిన విజయవాడ (Vijayawada) జవహర్ ఆటో నగర్.. అనేక రంగాలలో స్ఫూర్తి దాతగా నిలుస్తుంది. లక్షలాదిమందికి ఉపాధి చూపిస్తూ అన్నపూర్ణగా వెలుగొందుతోంది. వాహనాలు మరమ్మత్తు చేయడంలో ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడుతూ భారత దేశానికే వన్నె తెస్తుంది ఈ ఆటో నగర్. 275 ఎకరాలు సువిశాల ప్రదేశంలో నెలకొని ఉన్న విజయవాడ జవహర్ ఆటో నగర్ అన్ని వాహనాలకు మరమ్మతులు చేయడం, కొన్ని వాహనాలు తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. లక్షమందికి ఉపాధి కల్పిస్తుంది ఈ ఆటో నగర్. అప్పటి పారిశ్రామిక పరిశ్రమల శాఖ మంత్రి మర్రి చెన్నరెడ్డి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వంలో ఉండి ప్రత్యేక శ్రేద్ద తీసుకుని 275 ఎకరాల సువిశాల ప్రదేశానికి అంకురార్పణ చేశారు.
అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేతులు మీదగా శంకుస్థాపన చేశారు. ఆసియాలోనే అతిపెద్దదిగా ప్రసిద్ధికి ఎక్కిన విజయవాడ జవహర్ ఆటో నగర్ అనేక రంగాలలో స్ఫూర్తి దాతగా నిలుస్తుంది. వాహనాలు మరమ్మత్తు చేయడంలో ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడుతూ భారత దేశానికే వన్నె తెస్తుంది.
దీనికి మన ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పేరు పెట్టారు అప్పటి నుండి ఇప్పటి వరకు వాహన రంగంలో సాధించని ఘనత లేదంటే అతిశయోక్తి కాదు. విజయవాడలోని జవహర్ ఆటో నగర్ ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada