హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రెస్టారెంట్లపై విజిలెన్స్ అధికారులు..

రెస్టారెంట్లపై విజిలెన్స్ అధికారులు..

తనిఖీ చేపట్టిన అధికారులు

తనిఖీ చేపట్టిన అధికారులు

Andhra Pradesh: విజయవాడ కానూరు గొల్లపూడిలోని రెస్టారెంట్లపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

పవన్ కుమార్ న్యూస్ 18, తెలుగు

విజయవాడ కానూరు గొల్లపూడిలోని రెస్టారెంట్లపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎక్కువ రోజులు ఫ్రిజ్లో నిల్వ ఉంచిన చికెన్, అపరిశుభ్రంగా ఉన్న వంట పరిసరాలు, మరికొన్నిఆహారపదార్థాలు, నిల్వ ఉంచిన ఆయిన ఆయిల్ సీజ్ చేశారు. హోటల్ నిర్వాహుకులపై చర్యలు తీసుకున్నారు.

మనం రోజంతా కష్టపడేది పొట్ట కూటికోసమే. కానీ కొందరు ఎంత కష్టమైన ఇంట్లోనే వంట చేసుకుని తింటారు మరి కొందరు బయట ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. కానీ బయట నాణ్యత కలిగిన ఆహారం వస్తుందో, నిల్వ ఉన్న ఆహార పదార్థాలతో ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తారో మనకి తెలీదు. రెస్టారెంట్ కి వెళ్లిఆర్డర్ ఇచ్చితిని వచ్చేస్తారు కానీ ఎలాంటిది తింటున్నాం.. దానిని ఎలా తయారు చేస్తారనేది మనకు తెలీదు. కానీ అలా నిల్వ ఉన్న ఫుడ్ తినడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలియచేస్తున్నారు వైద్యులు.

విజయవాడ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి టి.కనక రాజు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి గొల్లపూడి మరియు కానూరులోని ఖలీల్ భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సదరు హోటల్ నందు అనుసరిస్తున్న ఆహార భద్రతా ప్రమాణాలను పరిశీ లించారుఅధికారులు.ఆహార పదార్థాలపై మూతలు లేకపోవడం, వంటశుభ్రంగా లేకపోవడం,రిఫ్రిజిరేటర్లో రోజుల తరబడి నిల్వ ఉన్న చికెన్తో చేసే ఆహారాన్నే భోజన ప్రియులకు వడ్డిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వచ్చి న ఆరోపణలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రెస్టారెంట్పై దాడులు చేశారు

రిఫ్రిజిరేటర్లో వండిన ఆహారం నిల్వ ఉంచుట.. FSSAI ప్రామాణికం లేని సలాడ్ ఆయిల్, జీరా సూప్, స్వీట్ సూప్ మరియు బోల్డ్ నూడుల్స్ వంటివి ఉపయోగించుట...ఒకసారి ఉపయోగించిన పోలార్ కాంపోనెంట్ నిర్దేశిత విలువ 25% కంటే ఎక్కువ కలిగిన వంట నునెని తిరిగి ఉపయోగించుట వంటి ఉల్లంఘనలకు గుర్తించారు. అధికారులు.

నిల్వ ఉంచిన ఆహరంనుంచి నమూనాలు సేకరించి స్టేట్ ఫుడ్ ల్యాబ్ హైదరాబాద్ కి విశ్లేషణ నిమిత్తంపంపడం జరిగినది. పైన తెలిపిన ఉల్లంఘనలకు గాను హో టల్ నిర్వాహకులకు నోటీసులు జారి చేసి దాని తర్వాత వారిపై తగు చర్యలు తీసుకోనుటకు పరిపాలన అధికారి మరియు జాయింట్ కలెక్టర్ కిఫిర్యాదు చేయటం జరిగింది.

హోటల్ నిర్వాహకులు అందరు కూడా FSSAI ప్రామాణికం కలిగిన పదార్ధాలు వినియోగించి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆహారం తయారు చేసి నాణ్యమైన ఆహరం వినియోగదారులకు అందచేయాలని రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి టి. కనక రాజు సూచించారు. లేని పక్షములో నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు