Home /News /andhra-pradesh /

VIJAYAWADA VEG AND NON VEG FAMOUS FOOD STALL NAMES GO CRAZY IN VIJAYAWADA NGS VPR NJ

Vijayawada: నాటు రుచులు నీటుగా.. వచ్చి తిని పో.. చింగ్‌ చాంగ్‌.. వీటి గురించి తెలిస్తే నోరూరాల్సిందే?

ఈ

ఈ పేరు చెబితే నోరూరాల్సిందే

Vijayawada: నాటు రుచులు నీటుగా.. వచ్చి తిని పో.. ఇదేంటి ఇంత నాటుగా పిలుస్తున్నారని డౌట్ పడుతున్నారా..? అయితే ఇది ఆహ్వానం కాదండి.. ఇవి రెస్టారెంట్ల పేర్లు.. మీరు విన్నది నిజమే.. అంతేకాదు వీటి గురించి తెలిస్తే నోరు ఊరాల్సిందే..

  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada
  Vijayawada: నాటు రుచులు నీటుగా.. వచ్చి తిని పో .. ఇవేవో సినిమా డైలాగులో.. లేక ఆహ్వానాలో కాదు.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) లో నయా ట్రెండ్.. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు రెస్టారెంట్ల యజమానులు (Restaurant) పెడుతున్న పేర్లు. అది కూడా వ్యాపార నగరం.. బెజవాడ (Bejawada) కనకదుర్మ సన్నిధి అయన విజయవాడ దర్శనమిస్తాయి. పద్మావతి ఘాట్‌ రోడ్‌ (Padmavath Ghat Raod)లో మనకు ఈ రెస్టారెంట్‌లు కనిపిస్తాయి. సాధారణంగా ఎవరైనా టిఫిన్ సెంటర్, హోటల్ ప్రారంభిస్తే.. వాటికి దేవుడు పేర్లు లేదా ఇంట్లో వాళ్ళ పేర్లు పెడుతుంటారు.. ఇప్పుడున్న కాలంలో ఇంకొందరు ఇంగ్లీష్‌ పేర్లతో ఆపసోపాలు పడుతూ జనాలకు అర్థమయ్యి..అర్థం కానీ పేర్లను పెడుతూ బిజినెస్‌ చేస్తుంటే…కాంతారావు అనే వ్యక్తి మన నిఖార్సయిన అచ్చతెలుగులో రెస్టారెంట్‌లకు పేర్లు పెట్టి సక్సెస్‌ఫుల్‌ అయ్యారు.


  ఆ పేరు పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది..?                                                 వచ్చి తిని పో పేరు పెట్టడానికి కారణం ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.. ఆయనే వివాదాస్పద దర్శకు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) . గతంలో మంగళగిరి సమీపంలోని హైలాండ్‌లో..  కాంతారావు ఫుడ్ అండ్ బెవరేజెస్‌ అధికారిగా పని చేసేవారు. ఆ సమయంలో హైలాండ్ లో జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌కు హాజరైన ఆర్జీవీ.. ఫంక్షన్‌ తర్వాత భోజనం చేసేముందు ఏదైనా ఐటమ్ ఆకర్షణ ఉండాలంటే దాని పేరు భిన్నంగా ఉండాలని సూచించారట. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి.. వచ్చి తిని పో సౌత్ ఇండియన్ టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు నిర్వహకులు కాంతారావు వెల్లడించారు. 

  ట్రోల్స్‌తో మరింత ఫేమస్‌ అయిన రెస్టారెంట్‌                                                  ప్రస్తుత కాలంలో ఏదైనా ట్రోల్స్‌ ద్వారానే త్వరగా ఫేమస్‌ అవుతుంది. కొన్ని సినిమా ప్రమోషన్స్‌, స్మాల్‌ స్క్రీన్‌ ఈవెంట్స్‌, యూట్యూబర్స్‌ .. ఇలా అన్ని ట్రోల్స్‌ ద్వారానే త్వరగా ఫేమస్‌ అవుతామనే కాన్సెప్ట్‌ను ఫాలో అవుతుంటారు. ఇదే ఫార్ములాను తన రెస్టారెంట్‌కు కూడా ఫాలో అయ్యారు కాంతారావు. వచ్చి తిని పో…! ఈ రెస్టారెంట్‌ పేరు విని చాలా మంది ఆశ్చర్యపోయారు. మరికొంతమంది తినిపోతే బిల్ ఎవరు కడతారు? అంటూ ట్రోల్స్‌ స్టార్ట్ చేశారు. దాని వల్లే ఈ రెస్టారెంట్‌ ఇంకాస్త ఫేమస్‌ అయిందంటే అతిశయోక్తి కాదు. ఏది ఏమైప్పటికీ ట్రెండ్ సెట్ చేస్తూ సౌత్ ఇండియాలో దొరికే టిఫిన్స్ నగర వాసులకు అందించాలని ధ్యేయంతో ఈ టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు నిర్వాహకులు కాంతారావు తెలిపారు.

  ఇదీ చదవండి : ఇనుమలో ఒక హృదయం మొలిచినే..? ట్రెండ్ సెట్ చేస్తున్న తెనాలి కుర్రాడు

  వచ్చి తినిపో..  లో స్పెషల్‌ ఫుడ్‌..!                                                              తెలుగు ప్రజలు కోరుకునే ఇడ్లీ నుంచి అన్ని రకాల టిఫిన్స్ అందిస్తున్నారు. బిస్మిల్లా బాత్… చాక్లెట్‌ దోశ, చోలా బతుర, కాంచీపురం ఇడ్లీ, మైసూర్‌ ఘీ కారం దోశ, పరాట గ్రేవీ.. ఇక్కడ దొరికే వెజిటేరియన్‌ టిఫెన్‌ ఫుడ్స్ లవర్స్‌ను నోరు ఊరేలా చేస్తాయి.  ఈ వచ్చి తినిపో.. సౌత్‌ ఇండియన్‌ టిఫెన్‌ సెంటర్‌కు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో.. దాని పక్కనే కాంతారావు మరికొన్ని ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేశారు. వాటిపేర్లు కూడా చాలా ఎట్రాక్టివ్‌గా పెట్టారు. అందులో ఈ నాటు రుచులు నీటుగా..  ఫుడ్‌ స్టాల్‌ భోజన ప్రియులకు మరింత ఆకట్టుకుంటుంది. ఇక్కడ దొరికే స్పెషల్‌ నాన్‌వేజ్‌ వంటకాల రుచి అమోఘం అంటున్నారు ఫుడ్‌ లవర్స్‌.

  ఇదీ చదవండి : ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం.. ఎల్లుండి ఉదయం 7 పోలింగ్‌.. ఫలితం ఎలా ఉండనుంది..?

  నాటు రుచులు నీటుగా… స్పెషల్ ఫుడ్‌:                                                          మిలాయ్‌ ఫలావ్‌ ( మటన్‌ కైమా ఫలవ్‌), వంజరం రోస్ట్‌, రాగిసంగటి నాటుకోడి, సెట్‌ దోశ, ఆంధ్రా చికెన్‌, బొమ్మిడాయిల పులుసు, కంజు పిట్ట రోస్ట్‌. ముఖ్యంగా రాజు గారి ఫలావ్‌ అనేది ఫ్యామిలీ మెంబర్స్‌కు స్పెషల్‌. ఎందుకంటే మెనులోని ఈ ఒక్క ఫలావ్‌ ఆర్డర్‌ చేస్తే నలుగురు నుంచి ఐదుగురికి వస్తుంది. అటు సౌత్‌ ఇండియన్‌ టిఫెన్‌ సెంటర్‌ (ఒన్లీ వెజ్‌), ఇటు నాటు రుచులు నీటుగా…(నాన్‌వేజ్‌) ఫుడ్‌ కోర్టులకు ఊహించని క్రేజ్‌ రావడంతో…అదే స్ఫూర్తిగా అక్కడే మరో మూడు స్టాళ్లను ఓపెన్‌ చేశారు. కేవలం సౌత్ ఇండియన్ టిఫిన్ సెంటరే కాకుండా చైనీస్ రెస్టారెంట్ చింగ్‌ చాంగ్‌, షోలే బెజవాడ దాభా, చాందిని చౌక్‌ అనే ఫుడ్ సెంటర్లు ప్రారంభించారు.

  ఇదీ చదవండి : జనసేనతో పొత్తు అంటే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారా..? అందుకే స్వరం మారిందా..?

  బిజినెస్‌ మార్కెటింగ్‌ ఫార్ములా ముఖ్యం                                                     బిజినెస్ చేయాలని చాలా మంది అనుకుంటారు….కానీ మార్కెటింగ్ సూత్రాలు తెలిసిన కొందరే సక్సెస్‌ అవుతుంటారు. ఈ రోజుల్లో మార్కెట్‌కు అనుగుణంగా బిజినెస్‌ లేకపోతే కష్టమని.. అందుకోసమే కొత్త పేర్లతో సరికొత్త రెసీపీలను నగరవాసులకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నాణ్యమైన భోజనం, బడ్జెట్‌ ఫ్రెండ్లీ ధరలకే అందిస్తూ ప్రజా దరణ పొందడం కూడా అతి ముఖ్యమైన విషయం. ప్రస్తుతం నగర వాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు వస్తుంటారు. వీకెండ్స్‌ వచ్చినా, హాలిడేస్‌ వచ్చినా ఫ్యామిలీస్‌తో కలిసి పద్మావతి ఘాట్‌ దగ్గర వాలిపోతుంటారు. అక్కడే పక్కన ఉన్న ఫన్‌జోన్‌లో ఎంజాయ్‌ చేసి..వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఫుడ్‌ కోర్టులో ఇష్టమైనది ఆర్డర్‌ చేసుకుని తినిపోతుంటారు. ఓ సారీ మీరు అటు వైపు వెళ్లినప్పుడు ట్రై చేసి రండి.

  అడ్రస్‌: పద్మావతి ఘాట్‌, కృష్ణ లంక, పండిట్‌ నెహ్రు బస్టాండ్‌ ఎదురుగా, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌ - 520013. ఫోన్‌ నెంబర్‌: 7702111115.


  ఎలా వెళ్లాలి?

  విజయవాడ బస్టాండ్‌కు ఎదురుగానే ఈ ఫుడ్‌ కోర్టు ఉంది. బస్టాండ్‌ నుంచి లోకల్ ఆటోలో వెళ్తే సరిగ్గా 10నిమిషాల్లో అక్కడకు చేరుకుంటాము. రైలు మార్గం ద్వారా అయితే విజయవాడ రైల్వేస్టేషన్‌ వరకు వచ్చి…అక్కడ నుంచి సిటీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు