Home /News /andhra-pradesh /

VIJAYAWADA VEDIC MATHS IS THE BEST SOLUTION FOR STUDENTS WHO ARE AFRAID OF MATHS IN VIJAYAWADA NJ VPR NGS

Vijayawada: లెక్కలు అనేసరికీ భయపడుతున్నారా? డోంట్ ఫియర్ అంటోంది వేదిక్‌ మ్యాథ్స్‌..

లెక్కలు

లెక్కలు అంటే భయపడ విద్యార్థులకు వరంలా మ్యాథ్స్

Vijayawada: విద్యార్థుల్లో చాలా మంది లెక్కలన్నా, లెక్కల మాస్టారన్నా భయపడుతుంటారు. స్కూల్‌లో మ్యాథ్స్‌ క్లాస్‌ స్టార్ట్ అయితే చాలు… కడుపునొప్పి, జ్వరమంటూ స్కూల్‌ ఎగ్గొడతారు. అలాంటి వారి కోసమే వేదిక్‌ మ్యాథ్స్‌. ఒకరకంగా చెప్పాలంటే లెక్కలంటే భయపడేవారికి వరంలాంటిది.

ఇంకా చదవండి ...
  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

  Easy Maths Tips: విద్యార్థుల్లో చాలా మంది లెక్కలన్నా, లెక్కల మాస్టారన్నా భయపడుతుంటారు. స్కూల్‌లో మ్యాథ్స్‌ క్లాస్‌ స్టార్ట్ అయితే చాలు… కష్టంగా, భారంగా ఫీల్ అవుతారు. లెక్కల పుస్తకం ఓపెన్ చేయగానే కొందరికి తల కూడా తిరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మ్యాథ్స్‌ క్లాస్‌ ఉంటుందనే భయంతో జ్వరమని, కడుపులో నొప్పని స్కూల్‌ మానేసే పిల్లలు ఉంటారు. గణితమంటే గజగజా వణికే వాళ్లకు… వేదిక్‌ మాథ్స్‌ ద్వారా భయాన్ని పొగొట్టొచ్చంటున్నారు అధ్యాపకులు. గణితంలోని లెక్కల సమస్యలను క్షణాల్లో పరిష్కరించేందుకు అవసరమైన ట్రిక్స్‌ను వేద గణితం నేర్పిస్తుంది. అలాగే లెక్కల సబ్జెక్టును విద్యార్థులు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆర్యభట్ట, వేదవ్యాసులు, శ్రీనాధుడు కాలంలో ఓ వెలుగు వెలిగిన వేద గణితం కాలక్రమేణా మరుగునపడిపోయింది.

  ఇప్పుడు ఈ వేద గణితం నేర్చుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతుండటంతో వెలుగులోకి వస్తుంది. అధ్యాపకురాలు లక్ష్మి ప్రసన్న. వేసవి కాలంలో పిల్లలు వివిధ రకాల కోర్సులు నేర్చుకుంటారు…. అందులో భాగంగా విజయవాడ నగరంలోని కేబీఎన్‌ కాలేజీలో వేదిక్ మ్యాథ్స్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆ వేద గణితం నేర్చుకునేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు.  వేదిక్‌ మాథ్స్‌ ఎలా వచ్చింది.?

  వేదిక్‌ మ్యాథ్స్‌ ప్రాచీన భారతీయ గణిత శాస్త్రం. ప్రస్తుత గణిత పద్ధతులకు తల్లిలాంటిది. పూర్వం రుషులు గురుకులాలలో కొన్ని సూత్రాల ద్వారా ఈ గణితం బోధించేవారు. వైదిక గణితము హిందూ పవిత్ర గ్రంథాలైన వేదాల నుంచి 1911 ,1918 సంవత్సరాల మధ్య కాలంలో స్వామి భారతి తీర్థ కృష్ణ మహావీర్‌ దీనిని అభివృద్ధి పరిచారు. పదహారు ముఖ్య గణిత సూత్రాల సంకలనమే వేదిక్ మాథ్స్.

  ఇదీ చదవండి : ఈ బాదుడేందిరో..? విద్యార్థులనూ వదలరా... ఆర్టీసీ వడ్డనపై నారా లోకేష్ ఆవేదన

  పవిత్ర వేదాలను అభ్యసించడం ద్వారా ఎందరో మహానుభావులు ఈ సూత్రాలు కనిపెట్టారు. వేదాలలో ఉన్న గణితాన్ని విపులీకరిస్తూ…. బోధాయాన మహర్షి, గార్గ్ మహర్షి, మేథాతిథి ,పరశరుడు ,కశ్యపుడు, మయుడు, బృహస్పతి తరువాతి కాలంలో ఆర్యబట్టు, వరాహమిహిరుడు, భాస్కరుడు అనేక గ్రంథాలు వ్రాశారు.

  ఇదీ చదవండి : ఆ మాత్రం దానికే ఆయన ఇంద్రుడు చంద్రుడా..? చంద్రబాబుసై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

  ఏడో శతాబ్దంలో ఉజ్జయిని వాసి అయిన కుంకుడు అనే పండితుడు అరబ్ పండితులకు గణితం బోధించినట్లు చరిత్రలు చెబుతున్నాయి . సిరియాలో 7వ శతబ్దములో తెలుగు అంకెలు వాడుకులో ఉన్నట్టు న్యూ లైట్ అన్ అవర్ న్యూమరల్స్ (new light on our numerals) అనే ఫ్రెంచ్ వ్యాసంలో కూడా పొందుపరిచారు. గణితం శాస్త్రం అరబ్బుల నుంచి ఆంగ్లేయులకు దగ్గరకు వెళ్లి…అక్కడ ప్రాచుర్యం పొంది తిరిగి భారతావనికి అదే గణితం.. ఆంగ్ల రూపంలో చేరిందని చరిత్రలు చెబుతున్నాయి.

  ఇదీ చదవండి : ఏపీ సర్కార్ కు బిగ్ షాక్.. ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయాలపై స్టే

  యజ్ఞ, యాగాదులు తలపెట్టినప్పుడు,…ఆ కార్యక్రమాన్ని అనుసరించి హోమగుండం, యజ్ఞ వాటిక నిర్మాణాల సైతం ఏ తీరుగ నిర్మించాలో మొదలకుని.. రుత్వికులు చేసిన అన్ని కార్యక్రమాల్లోనూ గణితం అంతర్లీనంగా ఉండేదని వేద గణితం చెబుతోంది. మన దగ్గర నుంచి వెళ్లిన వేదగణితాన్ని ఇప్పటికైనా వెలుగులోకి తెస్తున్నందుకు సంతోషంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆంగ్లం నుంచి మన దగ్గరకు వలస వచ్చిన గణితం కన్నా…మన వేధిక్‌ మాథ్స్‌ అత్యంత సులభతరంగా అర్థవంతంగా ఉంటాయనేది కొందరి వాదన. పిల్లలు కూడా ఈ మధ్య వేధిక్‌ మాథ్స్‌ అంటే చాలా ఇంటరెస్టెడ్‌గా నేర్చుకుంటున్నారు.

  ఇదీ చదవండి : ఏపీలో నేటి నుంచి బస్సు ఛార్జీల బాదుడు.. తిరుమల-తిరుపతి మధ్య భారీగా పెరిగిన ఛార్జీలు.. ధర ఎంతంటే?

  వేదగణితం వల్ల ఉపయోగం..!

  పోటీ పరీక్షల్లో మార్కులు సాధించేందుకు వేద గణితం బాగా ఉపయోగపడుతుండటంతో నేర్చుకునేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు. కష్టతరమైన అర్థమెటిక్స్, ఆల్‌జిబ్రా, జియోమెట్రీ, ట్రిగొనోమెట్రీ, రీజనింగ్ వంటి వాటికి.. వేద గణిత పద్ధతుల ద్వారా ఈజీ ట్రిక్స్‌తో జవాబులు తెలుసుకోవచ్చు. సాధారణ విద్యార్థి కంటే వేద గణిత విద్యార్థికి జ్ఞాపకశక్తి ఎక్కువుగా ఉంటుంది.

  ఇదీ చదవండి : సమయం లేదు మిత్రమా.. ప్రజల కష్టార్జితాన్నిదోచుకుంటోన్న వైసీపీని సాగనంపండి అంటూ నాగబాబు పిలుపు

  విద్యార్థుల మాటల్లో వేదిక్‌ మాథ్స్ ..!

  రెగ్యులర్‌ మాథ్స్‌ కన్నా వేదిక్ మాథ్స్ చాలా ఈజీగా ఉందంటున్నారు విద్యార్థులు. టీచర్ కూడా చాలా కష్టం తరంగ ఉన్న వాటిని సులభంగా ఎలా చేయాలో చెబుతున్నారంటోంది నిత్యశ్రీహాస అనే చిన్నారి. అంతేకాదు వేదిక్‌ మాథ్స్‌ ఎలా చేయాలో కూడా చాలా చక్కగా వివరిస్తోంది. గత రెండు నెలలుగా ఈ మాథ్స్‌ నేర్చుకుంటున్నామని…వేసవి సెలవలు అవడం వల్ల ప్రతి రోజూ వస్తున్నామంటున్నారు విద్యార్థులు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Local News, Maths, Students, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు